Begin typing your search above and press return to search.
ఇంకా 15 నిమిషాలు కలుపుతారట
By: Tupaki Desk | 1 Sep 2017 7:03 AM GMTమూడు గంటల సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఈ కాలంలో మూడు గంటలేంటి? ఖచ్చితంగా బెడిసికొట్టే వ్యవహారమిది అని మాట్లాడుకున్నారు. దర్శకనిర్మాతలకి కూడా సీరియస్ గా సలహాలు ఇచ్చారు. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం సీతయ్యలాగా ఎవరి మాటా వినకుండా తాను నమ్మిందే చేశాడు. ఫీల్ మిస్సవ్వకూడదని ఆయన తీసిన అర్జున్ రెడ్డిని మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. చివరికి ఆయన నమ్మకమే నిజమైంది. సినిమా 3 గంటలైనా అస్సలు బోర్ కొట్టలేదంటున్నారు ప్రేక్షకులు. చివరిదాకా ఓపిగ్గా చూసి బయటికొస్తున్నారు. ఇప్పుడు `అర్జున్ రెడ్డి` టీమ్ నుంచి మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఇప్పుడున్న సినిమాకి అదనంగా మరో 15 నిమిషాల ఫుటేజ్ కలపబోతున్నారట. అంటే 3 గంటల 15 నిమిషాల సినిమా అవుతుందన్నమాట. ఇటీవలే అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించాడు.
మొదట సినిమాని 3 గంటల 15 నిమిషాల నిడివితోనే రిలీజ్ చేయాలనుకొన్నారట. కానీ దర్శకుడిపై పెద్దయెత్తున ఒత్తిడి తీసుకురావడంతో ఆయన 3 గంటలకి కుదిరించాడట. కానీ ఇప్పుడు కట్ చేసిన ఆ 15 నిమిషాలు కూడా యాడ్ అయితే ఫీల్ మరింత బాగా పండుతుందని దర్శకుడు భావిస్తున్నాడట. మరి ఆ 15 నిమిషాలు ఇప్పటికిప్పుడే యాడ్ చేస్తారా? ఇంకొన్నాళ్లయ్యాకా అనేది చూడాలి. మామూలుగా సక్సెస్ అయిన సినిమాలకి మరిన్ని వసూళ్లు పెంచుకొనేందుకని కొన్ని రోజుల తర్వాత సీన్లు యాడ్ చేస్తుంటారు. అర్జున్ రెడ్డి మాత్రం ప్రస్తుతం మంచి వసూళ్లతో ఆడుతోంది. ఇప్పటికే పెద్ద సినిమా అంటున్నారు కాబట్టి ఇప్పటికప్పుడు యాడ్ చేయకుండా మరికొన్నాళ్ల తర్వాత చేయొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.