Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో 15 థియేటర్స్ మూత..?
By: Tupaki Desk | 27 Nov 2020 2:30 PM GMTకరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇక సినీ ఇండస్ట్రీపై మహమ్మారి వైరస్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. లాక్ డౌన్ సడలింపులలో భాగంగా హోటల్స్, పార్క్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని అప్పుడే ఓపెన్ అయినప్పటికీ థియేటర్స్ మాత్రం ఇన్ని రోజులు తెరుచుకోలేదు. దీనివల్ల థియేటర్ యాజమాన్యాలు బాగానే నష్టపోయారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో 50 శాతం పరిమితితో థియేటర్స్ తెరుచుకోవచ్చని తెలంగాణా ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే హైదరాబాద్ లో పలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ శాశ్వితంగా మూతబడనున్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్నేళ్లుగా సినీ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తున్న హైదరాబాద్ లోని సుమారు15 థియేటర్స్ క్లోజ్ చేయనున్నారట. శ్రీ రామ థియేటర్(బహదూర్‌పుర) - అంబ థియేటర్(మెహదీపట్నం) - శాంతి థియేటర్(నారాయణగూడ) - గెలాక్సీ థియేటర్(టోలిచౌకి) - శ్రీమయూరి థియేటర్(ఆర్టీసీ క్రాస్ రోడ్) - దిల్ సుఖ్ నగర్ లోని వెంకటాద్రి - మేఘ - సుష్మ లతో పాటు మరికొన్ని థియేటర్స్ మూతబడనున్నాయని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల నుండి మల్టీప్లెక్స్ లకు ధీటుగా ఈ థియేటర్స్ ని నడిపించారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా పది నెలల నుండి థియేటర్ లు మూతబడి ఉండటంతో రెవెన్యూ లేకపోవడంతో మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్త వినిపిస్తుంది.