Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ వల్ల 150 కోట్ల నష్టం
By: Tupaki Desk | 8 Feb 2020 8:30 AM GMTస్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తే లాభాల పంట పండటం ఖాయం అంటూ బడా నిర్మాతలంతా కూడా భారీ బడ్జెట్ పెడుతూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించేందుకు ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఈమద్య కాలంలో బడ్జెట్ పరిధి దాటి మరీ పెడుతున్న కారణంగా నిర్మాతలను స్టార్ హీరోలు నట్టేట ముంచేస్తున్నారు. స్టార్ అని.. సూపర్ స్టార్ అని నమ్మి భారీ బడ్జెట్ ఖర్చు చేస్తే నిర్మాతలకు చివరకు నష్టాలు.. బయ్యర్ల నుండి బెదిరింపులు ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ పరిస్థితి ఇలాగే ఉంది. తమిళ సినీ ఇండస్ట్రీలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న లైకా ప్రొడక్షన్స్ కు పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువ లాభాన్ని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా రజినీకాంత్ తో చేసిన రెండు సినిమాలు కూడా ఆ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చింది.
ముఖ్యంగా రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం లో వచ్చిన 2.ఓ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సినిమా సక్సెస్ అయినా నిర్మాతకు లాభాలు రాలేదు కదా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధ్యం అవ్వలేదు. 2.ఓ వల్ల లైకా వారు దాదాపుగా వంద కోట్ల వర కు నష్ట పోయి ఉంటారంటూ అప్పుడు వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు దర్బార్ వల్ల కూడా లైకా వారు నష్టపోయారట. రజినీకాంత్ కు భారీ పారితోషికం ఇచ్చి భారీ బడ్జెట్ తో దర్బార్ ను నిర్మించారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాదాపుగా 40 నుండి 50 కోట్ల వరకు దర్బార్ వల్ల లైకా ప్రొడక్షన్స్ వారు నష్టపోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన లెక్కలు అధికారికంగా బయటకు రాకున్నా కూడా తమిళ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లైకా ప్రొడక్షన్స్ మరోసారి రజినీకాంత్ తో సినిమా అంటే భయపడే స్థాయిలో పరిస్థితి ఉంది.
ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంతో పాటు మరో మూడు చిన్న చిత్రాలను కూడా లైకా వారు నిర్మిస్తున్నారు. తెలుగులో ఖైదీ నెం.150 చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ తర్వాత మళ్లీ కొనసాగించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న చిన్న బడ్జెట్ తోనే సినిమాలు చేయాలని లైకా వారు భావిస్తున్నారట. అందుకే ఇండియన్ 2 తప్ప మరే పెద్ద సినిమాలను మొదలు పెట్టడం లేదు.