Begin typing your search above and press return to search.
టికెట్ కొంటేనే సినిమా అంటున్న వర్మ.
By: Tupaki Desk | 24 Jan 2018 1:56 PM GMTవివాదాలకు పెట్టింది పేరు అయిన రామ్ గోపాల్ వర్మ ఇపుడు గాడ్..సెక్స్ అండ్ ట్రూత్.. పేరుతో ఒక షార్ట్ పోర్న్ ఫిల్మ్ తీసి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. కాగా, సోషల్ మీడియా పేజీలలో చాలా ఆక్టివ్ గా ఉండే ఆర్.జి.వి. ఇపుడు తన రాబోతున్న షార్ట్ ఫిల్మ్ ను కూడా అందులోనే ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఒక ఉచిత వీడియో షేరింగ్ ను కల్పించే వీమియో వెబ్ సైట్ లో రేలీజ్ చేస్తానని మనల్ని షాక్ కి గురి చేసిన వర్మ ఇపుడు మరొక షాక్ ఇచ్చాడు.
ఒక ప్రముఖ రైటర్ ఈ షార్ట్ ఫిల్మ్ ను సినిమాగా చేయడానికి కాపీ రైట్స్ అడగగా తను ఎలాగో ఎలాంటి డబ్బులు పొందటంలేదు కాబట్టి కాపీ రైట్స్ ప్రశ్న లేనే లేదు అన్నాడు. కానీ తాజా గా అందిన సమాచారం ప్రకారం ఈ షార్ట్ ఫిల్మ్ ను చూడటానికి వర్మ 150 రూపాయల టికెట్ పెడదాం అనుకుంటున్నాడు అని తెలుస్తోంది. 200 కు పైగా పోర్న్ సినిమాలలో నటించిన మియా మాల్కోవా ఇందులో నటిస్తూ ఉండగా ఆమె కూడా ప్రోమోషన్ల లో చాలా ఎక్కువగా పాల్గొంటోంది. ఇప్పటిదాకా ఇది ఒక ఎడ్యుకేషల్ వీడియో అని అందుకే ఫ్రీగా రిలీజ్ చేస్తానని చెపుకొచ్చిన వర్మ ఇపుడు ఉన్నట్టుండి ఎందుకు ప్లేట్ మార్చాడో అర్థంకాకుండా ఉంది.
అయిన ఇలాంటి వివాదాస్పద సినిమాలు తీయడము.. ఎదో ఒక ట్విస్ట్ పెట్టడం వర్మ కు కొత్త ఏంటి చెప్పండి. ఏదేమైనా.. ఇలాంటి సినిమాలు తీయలన్న విడుదల చేయాలన్న అది వర్మకే సాధ్యం. మరి 150 రూపాయలతో రెడీగా ఉండండి.