Begin typing your search above and press return to search.
పవన్ బంగారానికి పదహారేళ్లు
By: Tupaki Desk | 5 May 2022 3:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిచిన `బంగారం` మూవీ విడుదలై సరిగ్గా మే 3 మంగళవారానికి పదహారేళ్లు. 2006 లో విడుదలైన ఈ మూవీ ద్వారా తమిళ దర్శకుడు ధరణి, హీరోయిన్ మీరా చోప్రా, మలయాళ నటి సనూషా ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఖుషీ` ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా రికార్టు క్రియేట్ చేసింది. ఇలాంటి హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో `బంగారం` చిత్రంపై సహజంగానే అంచనాలు అంబరాన్నంటాయి.
అంతే కాకుండా ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో పవర్ స్టార్ ఫస్ట్ టైమ్ ఫ్యాక్షన్ నేపథ్యంలో చేసిన సినిమా కావడంతో ఎలా వుంటుందా అనే ఆసక్తిని అందరిలోనూ మొదలైంది. అంతే కాకుండా జానీ, గుడుంబా శంకర్, బాటు వంటి చిత్రాల తరువాత భారీ విజయం కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రోజులవి కావడం వల్ల కూడా `బంగారం` షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. విద్యాసార్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో ఆల్బమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పటికైనా బీబీసీ రిపోర్ట్ కావాలని కలలు గనే ఓ యువకుడి జీవితం ఓ యువతి కారణంగా ఎలాంటి మలుపులు తిరిగింది? . తన ప్రేమని కాపాడటం కోసం ఆ యువకుడు ఎలాంటి సాహసాలు చేశాడు. ఎంత మంది ఫ్యాక్షన్ లీడర్లను ఎదిరించాడు. చివరికి తనని నమ్మిన యువతి ప్రేమిని బంగారం ఎలా నిలబెట్టాడు? .. తనని తనప్రియుడి దగ్గరికి ఎలా చేర్చాడన్నది అసలు కథ. విచిత్రం ఏంటంటే ఇందులో పవన్ కు హీరోయిన్ లేకపోవడం. రాజాని ప్రేమించిన మీరా చోప్రా కోసం ఫ్యాక్షనిస్టులతో తలపడి బీబీసీ రిపోర్టర్ కావాలనే తన లక్ష్యాన్ని కోల్పోవడం పెద్దగా జనాలకు ఎక్కలేదు.
పాటు ఎంతగా బ్లాక్ బస్టర్ అయ్యాయో సినిమా మాత్రం రివర్స్ ఫలితాన్ని అందించింది. ఇక తమిళ దర్శకుడు కావడంతో ఈ మూవీ అరుపులు కేకలు సినిమాకి వెళ్లిన ఆడియన్ కు పిచ్చెక్కించాయి. ఈ సినిమా విషయంలో సౌండ్ ఇంజనీర్ దారుణంగా విఫలమయ్యాడు. కర్ణకఠోరమైన సౌండ్ సిస్టమ్ తో చాలా వరకు ఆడియన్స్ సినిమా పై ఆసంతృప్తిని వెల్లగక్కారు. వెరసి భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.
దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం 12 కోట్లని మాత్రమే రాబట్టగలిగింది. ఓవర్సీస్ లో 11కె లర్లను సొంతం చేసుకుంది. అశుతోష్ రాణా విలన్ గా నటించిన ఈ చిత్రంలో పవన్ వెంటపడుతూ ఆటపట్టించే యువతిగా రీమాసేన్ నటించింది. సినిమా ఎండింగ్ లో మా బాస్ కి హీరో లేదేంటి గురూ అని ఫ్యాన్స్ అరుపులు కేకల మధ్య ట్రైన్‌లో త్రిషని రంగంలోకి దింపాడు దర్శకుడు. పవన్ - త్రిషల మధ్య చిన్న సీన్ తో సినిమాకు ఎండ్ కార్డ్ పడిపోతుంది. సినిమా అంతా పవన్ కోసం కాకుండా మీరా చోప్రా కోసమే తీసినట్టుగా అనిపించింది. `బంగారం` మూవీ ఇచ్చిన షాక్ తో ఎ.ఎం. రత్నం మళ్లీ పవన్ తో సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు `హరి హర వీరమల్లు` చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు.