Begin typing your search above and press return to search.

డర్టీ భామకు 18కోట్లు.. బాప్రే

By:  Tupaki Desk   |   28 July 2015 11:40 AM IST
డర్టీ భామకు 18కోట్లు.. బాప్రే
X
అందం, అభినయంతో పాటు పరిణతి ఉన్న నాయికగా విద్యాబాలన్‌ పేరు చెబుతుంటారు. బాలీవుడ్‌ లో అత్యంత పరిణతితో నటించే కథానాయికగా బాలన్‌ కి పేరుంది. ఇష్కియా సిరీస్‌ నుంచి గురు, డర్టీపిక్చర్‌, కహానీ లాంటి సినిమాలు చూసినవారికి ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. కేవలం అందాల ఆరబోతలోనే కాదు నటనాభినయం పరాకాష్టలో చూపించడంలో విద్యా అసాధారణ ప్రతిభను కనబరుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

సంసార పక్షం కథానాయిక అని అందరూ అనుకుంటున్న టైమ్‌ లోనే ఇష్కియా, డర్టీ పిక్చర్‌ లాంటి సినిమాల్లో అందాల ఆరబోతకు సిద్ధపడి, ఊహాతీతమైన నటనతో ఆకట్టుకుంది. ఓ నటిలోని విలక్షణతకు అది నిదర్శనం. అందుకేనేమో ఇటీవలే ఆదూరి కహానీ ఫ్లాపైనా విద్యా క్రేజు ఎంతమాత్రం తగ్గనేలేదు. ఇప్పుడు ఈ భామకు ఏకంగా రూ.18కోట్లు పారితోషికం ఇవ్వడానికి బాలీవుడ్‌ లో ఓ నిర్మాత ముందుకొచ్చారని తెలుస్తోంది.

జాతీయ కాంగ్రెస్‌ నేత, భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఆటోబయోగ్రఫీలో విద్యాబాలన్‌ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి గాను ఇంత పెద్ద మొత్తాన్ని అందుకోబోతోంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేష్‌, పవన్‌ కల్యాణ్‌ అందుకున్నంత మొత్తాన్ని అందుకుంటోందన్నమాట!