Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : పీరియాడిక్ సినిమా లెక్క పీరియాడిక్ పోరీ
By: Tupaki Desk | 17 Dec 2022 1:05 PM GMT`కార్తికేయ 2` వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ `18 పేజెస్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ మూవీకి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎ2 పిక్చర్స్, సుకుమార్ వ్రైటింగ్స్ బ్యానర్ లపై బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియెని, హుక్‌స్టెప్ ప్రోమోని విడుదల చేసి సినిమాపై అంచనాల్ని పెంచేసిన మేకర్స్ అన్నట్టుగానే శని వారం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఫేస్ బుక్ లో అకౌంట్ లేని ఓ అమ్మాయి డైరీని ఫాలోఅవుతూ తన ప్రేమలో పడే ఓ యువకుడి కథగా ఈ మూవీని తెరకెక్కించారు. `నీకు ఫేస్ బుక్ లేదా.. లేదూ..వుంటే ఫొటోస్ తీసి పెట్టుకోవచ్చు కదా.. పెట్టుకుంటే..బోల్డన్ని లైక్ లొస్తాయ్.. అంటూ హీరో, హీరోయిన్ ల సరదా సంభాషణ నేపథ్యంలో ట్రైలర్ మొదలైంది.
పీరియాడిక్ సినిమాలెక్క పీరియాడిక్ పోరి ఏడీ 1990.. లాంటి ఓ అమ్మాయి చుట్టూ సాగే ఓ అందమైన ప్రేమకథా ఈ సినిమా వుంటుందని డైలాగ్ లని బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?.. ఎక్కడుంది?.. ఇంతకీ తన కథేంటీ?.. తన డైరీ హీరో చేతిలోకి ఎలా వచ్చింది?.. తన డైరీ హీరోకి ఎలాంటి పరిస్థితుల్లో లభించింది?.. ఇంతకీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వారెవరు?.. తనని హీరో కలుసుకున్నాడా?.. చివరికి ఈ కనిపించని కలల రాణి కోసం హీరో ఏం చేశాడు?.. తనని చివరికి చేరుకున్నాడా? ఇద్దరు కలిశారా? అన్నదే ఇందులో ఆసక్తికరం.
ఓ అమ్మాయి డైరీని ఫాలో అయ్యే హీరో కథగా సరి కొత్త నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించాడు. ట్రైలర్ లోని విజువల్స్, హీరో, హీరో హీరోయిన్ ల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేమ కథల్లో సరికొత్త కథగా ఈ సినిమా వుంటుందనే ఫీల్ ని ట్రైలర్ తో మేకర్స్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. విభిన్నమైన ప్రేమకథగా సాగనున్న ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం, ఏ వసంత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.