Begin typing your search above and press return to search.

20 ఏళ్ల ఒక్కడు మళ్లీ సంక్రాంతి సందడి

By:  Tupaki Desk   |   6 Sep 2022 2:30 AM GMT
20 ఏళ్ల ఒక్కడు మళ్లీ సంక్రాంతి సందడి
X
2003 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఒక్కడు సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎం ఎస్ రాజు ఆ సినిమాను నిర్మించాడు. భారీ ఎత్తున ఆ సినిమా వసూళ్లు సాధించడం మాత్రమే కాకుండా మహేష్ బాబుకు సూపర్‌ స్టార్‌ హోదాను కూడా కట్టబెట్టింది అనడంలో సందేహం లేదు.

ఒక్కడు సినిమా కోసం గుణశేఖర్ అప్పట్లో వేయించిన సెట్టింగ్‌ సంచలనం. అప్పట్లో కోటి రూపాయల తో ఛార్మినార్ మరియు పాతబస్తీ వీధి సెట్టింగ్‌ ను వేయించి అందరిని ఆశ్చర్చపర్చాడు. ఆ తర్వాత సెట్టింగ్స్ కు కోట్లల్లో ఖర్చు చేయడం కామన్ గా మారింది. ఒక సినిమాలో సెట్టింగ్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ఒక్కడు సినిమాను చూస్తే అర్థం అవుతుంది.

మహేష్‌ బాబు సినీ కెరీర్ లో నిలిచి పోయే ఒక్కడు సినిమా ను ఇటీవల ఆయన బర్త్‌ డే సందర్బంగా పలు థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శణ చేసిన విషయం తెల్సిందే. 4 కే రెజల్యూషన్‌ తో సినిమాను విడుదల చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా కి కూడా మంచి స్పందన దక్కింది.

ఆ స్పందన చూసిన మేకర్స్ సినిమా ను మళ్లీ విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. సరిగ్గా ఇరవై ఏళ్లకు అదే సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా డేట్‌ కూడా వచ్చింది.

జనవరి 8వ తారీకు అంటే సంక్రాంతికి వారం రోజుల ముందు ఒక్కడు సందడి చేయబోతున్నాడు. మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక్కడు సినిమాను ఎంజాయ్‌ చేస్తారని.. తప్పకుండా రీ రిలీజ్ లో భారీ వసూళ్లను ఒక్కడు నమోదు చేసే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.