Begin typing your search above and press return to search.
ఆ టాప్-10 జాబితాలో అక్షయ్-సల్మాన్!
By: Tupaki Desk | 23 Aug 2018 4:54 PM GMTబాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుస హిట్లతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. టాయిలెట్ - ప్యాడ్ మ్యాన్ - గోల్డ్ వంటి సామాజిక - దేశభక్తి ప్రధాన చిత్రాలతోనూ అక్కీ కమర్షియల్ హిట్లు సాధించి తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. విలక్షణ కథలతో దూసుకుపోతోన్న అక్షయ్ కుమార్...తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్ మరోసారి స్థానం దక్కించుకున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పాటు ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో నిలిచి తన సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న జాబితాలో అక్షయ్ కుమార్ ఏడో స్థానంలోనూ - సల్లూభాయ్ తొమ్మిదో స్థానంలోనూ నిలిచారు. అక్షయ్ కుమార్ 40.5 మిలియన్ డాలర్లు ఆదాయంతో 7వ స్థానంలో - సల్మాన్ ఖాన్ 38.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో 9వ స్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.
ఈ జాబితాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ 239 మిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. 124 మిలియన్ డాలర్లతో డ్వేన్ జాన్సన్ రెండోస్థానం దక్కించుకున్నాడు. మరోవైపు, ఈ జాబితాలో కొన్నేళ్లుగా స్థానం దక్కించుకుంటోన్న అమితాబ్ బచ్చన్ - షారుఖ్ ఖాన్ లు ఈ సారి స్థానం దక్కించుకోలేదు. `టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్రంతో అక్షయ్ స్వచ్ఛభారత్ పథకానికి విశేష ప్రచారం కల్పించారని ఫోర్బ్స్ కొనియాడింది. గ్రామీణ మహిళలకు అతి తక్కువ ధరకే శానిటరీ న్యాప్ కిన్లను అందజేసిన అరుణాచలం మురుగనాథమ్ కథను ప్రపంచానికి తెలియజేశారని ప్రశంసించింది. సినిమాలతో కొన్ని సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ అక్షయ్ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని పేర్కొంది.‘టైగర్ జిందా హై’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు , వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా భారత్ లో అత్యధిక ఆదాయం పొందుతున్న వారిలో ఒకడిగా సల్మాన్ కొనసాగుతున్నాడని తెలిపింది. మరోవైపు, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించిన ఫోర్బ్స్ 100 మంది సెలబ్రిటీల జాబితాలో అక్షయ్ కుమార్ (76), సల్మాన్ (82) స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే.