Begin typing your search above and press return to search.

2.0: హిందీ కి లాభాలు.. తెలుగు తమిళం నష్టాలు

By:  Tupaki Desk   |   16 Dec 2018 8:00 AM GMT
2.0: హిందీ కి లాభాలు.. తెలుగు తమిళం నష్టాలు
X
సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని అందుకున్నారుగానీ ఆశించినంత రేంజ్ లో మాత్రం కలెక్షన్స్ రాలేదు. హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటి కే లాభాల్లోకి ఎంటర్ అయింది. తాజా సమాచారం ప్రకారం రూ.175 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. త్వరలో రూ. 200 కోట్ల మార్కును టచ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. షారూఖ్ నటించిన కొత్త సినిమా 'జీరో' డిసెంబర్ 21 న రిలీజ్ అయ్యేంత వరకూ '2.0' జోరు ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటె తెలుగు వెర్షన్ 11 రోజుల కు గానూ దాదాపు 47 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు వెర్షన్ రైట్స్ 70+ కోట్లకు అమ్మడం జరిగింది కాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేందుకు ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది. ఫుల్ రన్ లో మరో రూ.15 కోట్ల రూపాయల షేర్ సాధించే అవకాశం ఉందని.. ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్ల కు 15% మేరకు నష్టాలు ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక తమిళ వెర్షన్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది.

సినిమా పై భారీ అంచనాలు ఉండడం.. ఎమోషనల్ కనెక్ట్ మిస్ కావడంతోనే సౌత్ ప్రేక్షకుల నుండి ఆశించినంత ఆదరణ దక్కలేదనే విశ్లేషణలు జోరు గా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటివరకూ సాధించన కలెక్షన్ ఫిగర్స్ శంకర్ బ్రాండ్ వ్యాల్యూ ఏ రేంజ్ లో ఉందో అది రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తోడైనప్పుడు ఎలా ఉంటుందో మరోసారి చాటి చెప్పాయి.