Begin typing your search above and press return to search.

2.ఓ- 4డి సౌండ్ కి రేర్ అవార్డ్‌?

By:  Tupaki Desk   |   20 Jan 2019 6:45 AM GMT
2.ఓ- 4డి సౌండ్ కి రేర్ అవార్డ్‌?
X
2.ఓ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. దాదాపు 600కోట్లు పైగా గ్రాస్ వ‌సూలు చేసింద‌ని లైకా సంస్థ ప్ర‌క‌టించింది. భార‌త‌దేశంలోనే టెక్నాల‌జీ ప‌రంగా బెస్ట్ చిత్ర‌మిదేన‌ని ప్ర‌ముఖ‌ క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇలాంటి టెక్నిక‌ల్ వండ‌ర్ ని డైరెక్ట్ చేసిన శంక‌ర్ కి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాజాగా 2.ఓ చిత్రానికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ సినిమా అమెరికా దేశానికి చెందిన‌ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుల్లో మ‌న దేశం నుంచి పోటీప‌డ‌నుంది.

66వ ఎంపిఎస్ ఇ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా అమెరికా `గోల్డెన్ రీల్ అవార్డ్‌`లో ప్రాంతీయ కేట‌గిరీలో పోటీప‌డే అవ‌కాశాన్ని 2.ఓ ద‌క్కించుకుంది. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సౌండ్ (4డి టెక్నాల‌జీ), బెస్ట్ ఎడిటింగ్ కేట‌గిరీలో ప్రాంతీయ విభాగంలో మ‌న దేశం త‌ర‌పున నామినేష‌న్స్ కు 2.ఓ ఎంపికైంది. ఈ విష‌యాన్ని 2.ఓ సౌండ్ డిజైన‌ర్ ర‌సూల్ పోకుట్టి స్వ‌యంగా వెల్ల‌డించారు.

`స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న రేర్ ట్యాలెంట్ ర‌సూల్ పోకుట్టి. మ‌రోసారి ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుల‌కు పోటీ ప‌డే అవ‌కాశం ద‌క్క‌డంపైనా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 2.ఓ చిత్రంతో ఆయ‌న 4డి సౌండ్‌ టెక్నాల‌జీని ప‌రిచయం చేశారు. దేశంలోనే ఈ త‌ర‌హా సౌండింగ్ విధానం ఇదే తొలిసారి. ఇక గోల్డెన్ రీల్ అవార్డ్స్ కోసం ఇప్ప‌టికే త‌న టీమ్ ఐదోసారి పోటీప‌డే ఛాన్స్ ద‌క్కించుకుంద‌ని ర‌సూల్ వెల్ల‌డించారు. ఇదివ‌ర‌కూ ర‌సూల్ సౌండ్ డిజైన్ చేసిన ప‌లు చిత్రాలు ఈ అవార్డుల్లో పోటీప‌డ్డాయి. హైలెవ‌ల్లో టెక్నిక‌ల్ బ్రిలియ‌న్సీని ప్ర‌పంచం హ‌ర్షిస్తుంద‌న‌డానికి తాజా ఎంపికే ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌న‌మ‌ని ర‌సూల్ ఈ సంద‌ర్భంగా అన్నారు.