Begin typing your search above and press return to search.
ఆ రెండింటికి అందనంత ఎత్తులో బాహుబలి
By: Tupaki Desk | 30 Sep 2018 1:30 AM GMTఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 'బాహుబలి' మార్కెట్ డైనమిక్స్ ను పూర్తిగా మార్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకు ముందు భారీ బడ్జెట్ సినిమాలంటే ఎందుకు రిస్క్ అని భయపడే స్టార్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కంటెంట్ మీద నమ్మకం ఉంటే ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యేలా చేసింది. ఇక బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలు రెండు.. ఒకటి '2.0'... రెండవది 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'.
చిత్రమైన విషయం ఎంటంటే రెండు సినిమాల ట్రైలర్లు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయాయి. '2.0' ట్రైలర్ చాలామందికి నచ్చినా 'రోబో' రీహ్యాష్ అని కొంతమంది పెదవి విరిచారు. మరి కొందరేమో రూ. 500 కోట్లు అని హంగామా చేసి తీరా ఇదా చూపించింది అని నిరుత్సాహానికి గురయ్యారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' పరిస్థితి ఇంతకంటే మిన్నగా ఏమీ లేదు. ట్రైలర్ వచ్చిన మొదటి రోజు రెస్పాన్స్ బాగున్నా ఇప్పుడు వంకలు పెట్టడం మొదలు పెట్టారు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ ను ఫుల్ గా కాపీ కొట్టారని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ కాస్త డిజప్పాయింటింగ్ గా ఉన్నాయని అంటున్నారు.
ఏదేమైనా 'బాహుబలి' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకుల్లో 'ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లోనే చూడాలి అసలు మిస్ కాకూడదు' అనే భావన కలిగించింది. కానీ ఆ విషయంలో మాత్రం '2.0'... 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ట్రైలర్లు బాహుబలి కి ఆమడ దూరంలో ఆగిపోయాయి. ఇది ట్రైలర్ కు సంబంచిందిన టాపిక్ మాత్రమే కాబట్టి సినిమాలో మంచి కంటెంట్ ఉంటే మాత్రం రికార్డులను తిరగారాస్తాయి అనడంలో సందేహం లేదు.