Begin typing your search above and press return to search.

4 రోజుల వసూళ్లు: 2.0 గట్టెక్కుతుందా?

By:  Tupaki Desk   |   3 Dec 2018 6:53 AM GMT
4 రోజుల వసూళ్లు: 2.0 గట్టెక్కుతుందా?
X
దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో రూపొందిన విజువల్ వండర్ 2.0 వీకెండ్ ని బాగానే వాడుకుంటునప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు నమోదు కాకపోవడం బయ్యర్లను కొంత ఖంగారు పెడుతోంది. దేశవ్యాప్తంగా చాలా కీలకంగా భావించిన నాలుగు రోజుల వారాంతాన్ని చిట్టి పూర్తిగా సద్వినియోగపరుచుకోలేదనే ట్రేడ్ టాక్. ముఖ్యంగా దుమ్ముదులపాల్సిన సౌత్ లో కాస్త స్లోగా ఉండగా నార్త్ లోనే మంచి వసూళ్లు నమోదు కావడం విశేషం.

తెలుగు వెర్షన్ వరకు జోరు బాగానే ఉన్నా తమిళ్ నుంచి మాత్రం జోష్ తగ్గినట్టుగా సమాచారం. కానీ నిన్న ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 2.0 మంచి వసూళ్లు దక్కించుకుంది. అనూహ్యంగా 8 కోట్లకు పైగా సింగల్ డే షేర్ రాబట్టి డబ్బింగ్ సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం నాలుగు రోజులకు గాను 33 కోట్ల షేర్ దాటేసిన 2.0 ఇంకా సగానికి పైగానే పెట్టుబడి వెనక్కు ఇవ్వాల్సి ఉంది. వీకెండ్ మొత్తం నాలుగు రోజుల తెలుగు రాష్ట్రాల షేర్ ఈ విధంగా ఉంది

నైజామ్ - 13 కోట్ల 71 లక్షలు

సీడెడ్ - 4 కోట్ల 95 లక్షలు

ఉత్తరాంధ్ర - 4 కోట్ల 27 లక్షలు

గుంటూరు - 2 కోట్ల 58 లక్షలు

ఈస్ట్ గోదావరి - 2 కోట్ల 46 లక్షలు

వెస్ట్ గోదావరి - 1 కోటి 71 లక్షలు

కృష్ణా - 2 కోట్లు

నెల్లూరు - 1 కోటి 37 లక్షలు

తెలుగు రాష్ట్రాలు 4 రోజుల టోటల్ షేర్ - 33 కోట్ల 5 లక్షలు

విచిత్రంగా తమిళనాడులో మాత్రం 2.0 అద్భుతాలు చేయడం లేదు. మూడు రోజుల్లో కేవలం 34 కోట్లకు మాత్రమే రాబట్టిన 2.0 సర్కార్ మొదటిరోజు కలెక్షన్ కంటే కేవలం రెండు కోట్లే ఎక్కువ రాబట్టడం పరిస్థితిని సూచిస్తోంది. నిన్న ఆదివారం ఫిగర్ ఇంకా జత చేయాల్సి ఉన్నప్పటికీ మొత్తానికి చూసుకుంటే మెర్సల్ సర్కార్ తర్వాత మూడో స్థానమే దక్కుతుందని రిపోర్ట్.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 2.0 ఇప్పటికి సగానికి దగ్గర్లో ఉంది.ఈ రోజు నుంచి డ్రాప్ ఎంత శాతంలో ఉంటుంది అనే దాన్ని బట్టి రికవరీ ఆధారపడి ఉంటుంది. బయ్యర్లు ఇప్పటికైతే ఇంకా రిస్క్ లోనే ఉన్నారు. బుధవారం దాకా వసూళ్ల ట్రెండ్ ని బట్టి 2.0 ఫైనల్ గా సేఫ్ అవుతుందా లేదా తేలిపోతుంది

Disclaimer: Data Gathered From Various Confidential Sources And May Also Include Estimates, We Dont Gaurantee any Aunthenticity Of The Same