Begin typing your search above and press return to search.
రోజుకు 100 కోట్లు : 2.0 అఫీషియల్
By: Tupaki Desk | 3 Dec 2018 10:51 AM GMTసాధారణంగా ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా స్టార్ హీరో ఎవరున్నా అధికారికంగా వసూళ్లు ప్రకటించడానికి నిర్మాతలు కాస్త ముందు వెనుకా ఆలోచిస్తారు. గత ఏడాది ఇలా అంకెలని పోస్టర్స్ లో వేయడం ఇద్దరు టాప్ హీరోలతో వేర్వేరు సినిమాలు తీస్తున్న ఓ అగ్ర నిర్మాతకు చిక్కులు తెచ్చి పెట్టింది. అందుకే బయట ఎంత ప్రచారం జరిగినా సైలెంట్ గా ఉండటం అధిక శాతం నిర్మాతలు చేసే పని. కాని సూపర్ స్టార్ రజనికాంత్ శంకర్ ల క్రేజీ కాంబోలో 2.0 నిర్మించిన లైకా సంస్థ మాత్రం ఈ విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా ఘనంగా తమ సినిమా ఎంత సాదించింది అనేది ఫిగర్స్ రూపంలో గర్వంగా ప్రకటించేసింది.
నిన్న ఆదివారంతో కలిపి మొత్తం నాలుగు రోజులకు 400 కోట్లు వసూలైనట్టు ఇది మాములు బ్లాక్ బస్టర్ కాదని మెగా బ్లాక్ బస్టర్ అని ప్రకటించి అభిమానుల అనుమానాలకు తెరవేసింది. అయితే ఏరియాల వారిగా బాషల వారిగా లైకా సంస్థ డీటెయిల్ లెక్కలు చెప్పలేదు. సో లైకా చెప్పిన లెక్క ప్రకారం దీనికైన బడ్జెట్ 600 కోట్లు వచ్చే వీకెండ్ కు ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క చెన్నైలోనే పది కోట్ల వసూళ్లు దాటాయని రిపోర్ట్స్ ఉన్నాయి. ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్కు దాటి బాహుబలి తర్వాత ప్లేస్ కొట్టేసిన 2.0 ఈ జోరు ఇంకెన్ని రోజులు కొనసాగిస్తుంది అనే దాని మీదే ఓవరాల్ రేంజ్ ఆధారపడి ఉంటుంది..
ఇండియా వసూళ్లు విడిగా చూసుకుంటే 210 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు చెబుతున్నారు. కేరళలో 6 కోట్లు కర్ణాటకలో 5 కోట్లతో అక్కడా రికార్డుల వేట సాగిస్తోంది. ఎలా చూసుకున్నా తెలుగు వెర్షన్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. స్ట్రెయిట్ సినిమాలకు సైతం చాలా కష్టంగా అనిపించే 30 కోట్ల షేర్ ని తెలుగులో ఈజీగా దాటేసిన 2.0 విజువల్ ఎఫెక్ట్స్ ప్లస్ 3డి ప్రచారంతో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. కాకపోతే తెలుగులో నిర్దేశించిన 72 కోట్ల షేర్ ని చేరుకోవడం మాత్రం అంత ఈజీ కాదు.