Begin typing your search above and press return to search.
మూడు సెంచరీలు కొట్టిన 2.0
By: Tupaki Desk | 13 Dec 2018 7:47 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘2.0’ బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఉనికిని చాటుకుంటోంది 2డీ స్క్రీన్లలో చాలా వరకు సినిమాను తీసేశారు. త్రీడీ వెర్షన్ మాత్రం బాగానే ఆడుతోంది. రెండు వారాల తర్వాత కూడా మంచి వసూళ్లే వస్తున్నాయక్కడ. ఒక్క హిందీ వెర్షన్ మాత్రే బ్రేక్ ఈవెన్ కు రాగా.. తెలుగు.. తమిళ వెర్షన్లు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ సినిమా స్థాయికి ఇంకా గొప్పగా పెర్ఫామ్ చేయాలి కానీ.. దీనికి వచ్చిన మిక్స్డ్ టాక్ ప్రకారం చూస్తే మంచి వసూళ్లు వస్తున్నట్లే లెక్క. తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనత సాధించింది. తెలుగు.. తమిళం.. హిందీ... మూడు వెర్షన్లలోనూ రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుని ‘బాహుబలి’ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది.
హిందీలో ఈ చిత్ర వసూళ్లు రూ.180 కోట్ల దాకా ఉండటం విశేషం. తొలి వారాంతానికే ‘2.0’ హిందీ వెర్షన్ వసూళ్లు రూ.100 కోట్లకు చేరువయ్యాయి. ఆ తర్వాత కూడా ఇది బాగానే పెర్ఫామ్ చేసింది. తెలుగు.. తమిళంలో దాదాపుగా ఒకసారి ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల వరకు ఈ చిత్రం రూ.85 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. మిగతా అన్ని చోట్లా కలిపి ఇంకో 15 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. తమిళ వెర్షన్ 100 కోట్ల మార్కును అందుకోవడం ఆలస్యం అయింది. మరో తమిళ స్టార్ హీరో విజయ్ శరవేగంగా వంద కోట్ల మార్కును అందుకుంటుండగా.. రజనీ సినిమా ఆలస్యంగా ఈ మార్కును టచ్ చేసింది. ఈ చిత్రం తమిళనాట ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. కాకపోతే సినిమాకు లాంగ్ రన్ ఉండటం వల్ల నష్టాలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.