Begin typing your search above and press return to search.
అమెరికా లో 20 కోట్ల క్లబ్.. బన్ని కెరీర్ రికార్డ్
By: Tupaki Desk | 21 Jan 2020 6:58 AM GMTఅమెరికాలో 3 మిలియన్ డాలర్ క్లబ్ అంటే ఆషామాషీనా? ఈ క్లబ్ లో అడుగు పెడితే అమెరికాలో మరో నైజాం రేంజు రికార్డు సాధ్యమైనట్టే. ఇలాంటి ఫీట్ కేవలం బాహుబలి 1.. 2 సిరీస్ .. ఆ తర్వాత రంగస్థలం - భరత్ అనే నేను- సాహో చిత్రాలు మాత్రమే అందుకోగలిగాయి. ఇప్పుడు అమెరికా టాప్ 10 సినిమాల్లో బన్ని నటించిన అల వైకుంఠపురములో చేరింది. ఇన్నాళ్లు తనకు అందకుండా దూరమైన అమెరికా బాక్సాఫీస్ రికార్డ్ ఎట్టకేలకు బన్ని ఖాతాలో పడిపోయింది. ఇదంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని నమ్మి అవకాశం ఇచ్చినందుకు అతడు అందించిన ప్రతిఫలం అనే చెప్పాలి.
అల వైకుంఠపురములో రిలీజై రెండో సోమవారం నాటికి 3 మిలియన్ డాలర్ క్లబ్ సాధ్యమైంది. 3 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.21 కోట్లు. ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం అంటే అదో అరుదైన ఫీట్ అనే చెప్పాలి. అమెరికా- ఓవర్సీస్ మార్కెట్లో ఇది అల్లు అర్జున్ కి పెద్ద బూస్ట్ అని భావించాల్సి ఉంటుంది. సంక్రాంతి పందెంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఓవర్సీస్ లోనూ అల వైకుంఠపురములో ఆధిపత్యం స్పష్ఠంగా కనిపించింది.
ఇక గల్ఫ్ సహా బ్రిటన్.. ఆస్ట్రేలియా లాంటి చోట్లా అల వైకుంఠపురములో చక్కని వసూళ్లు సాధించిందని రిపోర్ట్ అందింది. కేవలం ఆయిల్ దేశాల్లో 3-4కోట్లు సుమారుగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్ పంపిణీ దారులకు అమ్మిన మొత్తానికి సుమారు అంతే పెద్ద మొత్తం లాభాలు దక్కే వీలుందని అంచనా వేస్తున్నారు