Begin typing your search above and press return to search.
2.0 టార్గెట్ ఈజీ కాదు!
By: Tupaki Desk | 1 Dec 2018 7:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబోలో విడుదలైన 2.0 ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దులిపేస్తోంది. డబ్బింగ్ సినిమాల వరకూ చూసుకుంటే భారీ రికార్డులు అయితే నమోదవుతున్నాయి. కాకపోతే బాహుబలి స్థాయిలో వసూళ్లను ఆశించిన నిర్మాతలు అభిమానులు మాత్రం ఆ రేంజ్ ఫిగర్స్ కనిపించకపోవడం పట్ల కొంత ఆందోళనగా ఉన్నా ఈ రెండు రోజులు చాలా కీలకంగా మారింది. 2.0కి కలిసి వచ్చిన అతి పెద్ద అనుకూలాంశం గురువారం విడుదల. ఏకంగా నాలుగు రోజుల వీకెండ్ దక్కింది.
విజువల్ ఎఫెక్ట్స్ ఆకర్షణగా నిలవడంతో ఎలాగైనా త్రిడిలో చూడాలనుకున్న ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ రోజు రేపు అడ్వాన్స్ బుకింగ్ ని దాదాపు నింపేసారు. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలలో శని ఆదివారాలు టికెట్లు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. సో ముందు రోజులను ఇప్పుడే గెస్ చేయలేం కానీ ఇప్పుడు మాత్రం ఈ 2 డేస్ ఛాలెంజ్ చిట్టికి కీలకం. టాక్ పరంగా అందరి నోటా 2.0 యునానిమస్ గా నిలవకపోవడం కొంత ప్రభావం చూపుతోంది. ఒకవేళ 2.0 కనక త్రిడి వెర్షన్ కాకుండా రోబో లాగా సాధారణ వెర్షన్ అయ్యుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని ట్రేడ్ టాక్.
కేవలం త్రిడి ఎఫెక్ట్స్ కోసం సినిమా చూడాలనుకుంటున్న సంఖ్య ఎక్కువగా ఉందని థియేటర్ల ఆక్యుపెన్సి ని బట్టి అర్థమవుతోంది. మరోవైపు చూస్తే ఇది త్రిడిలోనే చూడాలన్న ప్రచారం సోమవారం నుంచి సింగల్ స్క్రీన్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ వీక్ కనక మరో 15 లేదా 20 కోట్లు రాబట్టగలిగితే సగం పెట్టుబడి వచ్చేసినట్టే. తర్వాత కాస్త స్లో అయినా ఓవరాల్ గా సేఫ్ అవ్వొచ్చు. అయినప్పటికీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే తెలుగు వెర్షన్ మీద పెట్టిన 75 కోట్ల పెట్టుబడి మాత్రం అంత సులభంగా అయితే వచ్చే ఛాన్స్ లేదు. మరి పబ్లిసిటీ డోస్ ఏమైనా పెంచేలా చర్యలు తీసుకుంటారేమో వేసి చూడాలి