Begin typing your search above and press return to search.

అన్నంత ప‌నీ చేసిన త‌మిళ్‌ రాక‌ర్స్‌

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:45 PM GMT
అన్నంత ప‌నీ చేసిన త‌మిళ్‌ రాక‌ర్స్‌
X
దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించి - నాలుగేళ్ల పాటు.. వంద‌లాది మంది టెక్నీషియ‌న్లు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తే .. రూపొందిన సినిమా 2.0. ఇలాంటి సినిమాని పైర‌సీకారులు లీక్ చేసినా చూడ‌కండి. థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాని బ‌తికించండి అని ప్రాధేయ ప‌డింది లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌. సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం ఈ సందేశం వైర‌ల్ అవుతోంది. ఉద‌యం ఆట ప‌డింది మొద‌లు.. త‌మిళ‌నాడు వ్యాప్తంగా ర‌జ‌నీ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఒక అద్భుతాన్ని చూశామ‌న్న ఆనందంతో డ‌ప్పులు వాయిస్తూ మ‌తాబులు - తారా జువ్వ‌లు వెలిగించి సంబ‌రాలు చేసుకుంటున్నారు. అన్నిటికీ మించి భార‌త దేశంలో సైతం ఇక మీద‌ట అవెంజ‌ర్స్ - బ్లాక్ పాంథ‌ర్ - బ్యాట్‌ మేన్‌ - స్పైడ‌ర్‌ మేన్‌ లాంటి గొప్ప సినిమాల్ని తీయ‌గ‌లిగే స‌త్తా ఉంద‌ని శంక‌ర్ నిరూపించార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. 2.0కి స‌మీక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా 3డి విజువ‌ల్స్ - టెక్నికాలిటీస్ ప‌రంగా ఎంతో గొప్ప స్టాండార్డ్స్‌ని ఆవిష్క‌రించింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అయితే ఇదేమీ ప‌ట్ట‌ని ప్ర‌పంచం వేరొక‌టి ఉంది. అదే పైర‌సీ. ఎవ‌రి క‌ష్టం ఎంత‌? అన్న‌ది వీళ్ల‌కు అన‌వ‌స‌రం. సినిమా రిలీజైన కొన్ని గంట‌ల్లోనే ఆన్‌ లైన్‌ లో టొరెంట్ల రూపంలో అందుబాటులోకి తెచ్చేయ‌డం వీళ్ల ప‌ని. బిలియ‌న్ డాల‌ర్ బిజినెస్ ప్ర‌పంచానికి ఒణుకు పుట్టిస్తూ పైర‌సీకారులు చెల‌రేగిపోవ‌డంపై నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. ముఖ్యంగా త‌మిళ్ రాక‌ర్స్ ఈ సినిమా రిలీజ్‌ కి ముందే హెచ్చ‌రించి మ‌రీ పైర‌సీ లింకుల్ని అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌స్తుతం వీటిని ఎంతో మంది యూత్ డౌన్‌ లోడ్ చేసి మ‌రీ చూసేస్తున్నారు. మ‌ద్రాస్ హైకోర్టు హెచ్చ‌రికల ప్ర‌కారం 37 ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌(ఐఎస్‌ పీలు)పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సైబ‌ర్ క్రైమ్ పోలీస్ ప్రిపేరైంది. త‌మిళ్‌రాక‌ర్స్‌కే చెందిన‌ 2000 వెబ్‌సైట్ల‌కు చెందిన 12,564 యుఆర్ ఎల్స్ ని గుర్తించి వాటిని బంద్ చేయించేందుకు రెడీ అయ్యారు. అయినా టొరెంట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. య‌థేచ్ఛ‌గా ఉచిత‌ డౌన్‌ లోడ్స్ సాగుతున్నాయి.