Begin typing your search above and press return to search.

2.0కి రివ్యూల‌ ఒణుకు టెన్ష‌న్

By:  Tupaki Desk   |   28 Nov 2018 4:26 AM GMT
2.0కి రివ్యూల‌ ఒణుకు టెన్ష‌న్
X
2.ఓ ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగుతోంది. 29-11-18 డెస్టినేష‌న్ డే! నేటి మిడ్ నైట్‌ కే ప్రీమియ‌ర్ల నుంచి టాక్ ఏంటి అన్న‌ది లీక‌వుతుంది. రేప‌టి ఉద‌యానికే అసలు ఈ సినిమాలో ద‌మ్మెంతో స‌మీక్ష‌కులు తేల్చేస్తారు. ఈ నేప‌థ్యంలో అటు వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ కొనుక్కున్న పంపిణీదారుల్లో - ఇటు తెలుగు హ‌క్కులు కొనుక్కున్న ఎన్‌ వీఆర్ సినిమాస్ అధినేత‌ల్లో ఒక‌టే ఒణుకు స్టార్ట‌యిందిట‌. స‌మీక్ష‌కులు ఎంత‌గా పొగిడేస్తే అంత‌గా సినిమా రిజ‌ల్ట్ మెరుగ‌వుతుంది. ఏమాత్రం త‌క్కువ చేసి రాసినా దాని ప్ర‌భావం బాక్సాఫీస్‌ పై ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.

అయితే తెలుగు వెర్ష‌న్ పంపిణీదారుల్లో టెన్ష‌న్ ఎందుకు? అంటే దాదాపు 82కోట్ల మేర పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అంత పెద్ద మొత్తం రిక‌వ‌రీ అంటే ఓ పెద్ద ఛాలెంజ్ కిందే లెక్క‌. 100కోట్ల షేర్ వ‌స్తే కానీ సినిమా సేఫ్ అని అన‌లేని ప‌రిస్థితి. మ‌రోవైపు స‌మీక్ష‌కుల వైపు నుంచి పాజిటివ్ రివ్యూలు ఉంటేనే తొలి మూడు రోజుల త‌ర్వాత అదే ఊపు కొన‌సాగుతుంది. లేదంటే ఆ మేర‌కు పంచ్ ప‌డుతుంద‌న్న టెన్ష‌న్ ఎలానూ ఉండ‌నే ఉంటుంది.

ఇదివ‌ర‌కూ `బాహుబ‌లి` సిరీస్‌ కి రివ్యూలు పెద్ద పంచ్ ఇచ్చాయి. వ‌సూళ్ల‌తో సంబంధం లేకుండా ర‌క‌ర‌కాల కోణాల్లో సినిమాపై క్రిటిసిజ‌మ్ ఇబ్బంది పెట్టింది. కొన్ని ఆంగ్ల ప‌త్రిక‌లు మిన‌హా తెలుగు మీడియా నుంచి తీవ్ర‌ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అయితే మీడియాని నిర్మాత‌లు దూరం పెట్టిన ప‌ర్య‌వ‌సానం కొంత‌మేర ప్ర‌భావం చూపించింది. ఈసారి కూడా 2.0 ప‌రిస్థితి అదే. అందుకే ఈ కొత్త టెన్ష‌న్. స్టార్ల‌ను హైద‌రాబాద్‌ కి ర‌ప్పించి తూతూగా చేసిన ప్ర‌చారం ఈ సినిమాకి ఊపు తెచ్చిందేం లేదు. ట్రైల‌ర్‌ తోనే హిట్టు కొట్టాం అన్న కాన్ఫిడెన్స్‌ లో ఉంది టీమ్‌. ఏదేమైనా దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్ తో తీసిన‌ సినిమా ప్ర‌చారంలో కాస్త వెన‌క‌బ‌డింద‌నే చెప్పాలి. ఇక‌పై ఎలాంటి రివ్యూలు రాబోతున్నాయి? అన్న‌దానిపై జ‌నాల్లో - మేక‌ర్స్‌ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒక‌టే ఉత్కంఠ‌.. ల‌బ్ డ‌బ్!! ఈ టెన్ష‌న్ నుంచి రిలీవ్ కావ‌డానికి ఇంకా కొన్ని గంట‌లే స‌మ‌యం ఉంది.