Begin typing your search above and press return to search.
2.ఓ : రెండవ రోజు పరిస్థితి మారిపోయింది
By: Tupaki Desk | 1 Dec 2018 2:45 AM GMTదాదాపు సంవత్సర కాలం పాటు అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన ‘2.ఓ’ చిత్రం రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని తమిళ సినీ వర్గాల వారు గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. కాని మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఆ స్థాయిలో రాలేదని చెప్పాలి. ముఖ్యంగా యూఎస్ లో ‘2.ఓ’ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల వారికి కూడా షాక్ ఇచ్చాడు. బాహుబలి రికార్డు సంగతి ఏమో కాని, ఒక మోస్తరు కలెక్షన్స్ కే అక్కడ ఇబ్బందయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.
మొదటి రోజు యావరేజ్ కలెక్షన్స్ నే రాబట్టిన ‘2.ఓ’ రెండవ రోజు అంటే నిన్న శుక్రవారం మాత్రం భారీగా రాబట్టింది. మొదటి రోజు సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకోవడంతో పాటు, పాజిటివ్ రివ్యూలు రావడంతో శుక్రవారం నుండి సినిమా కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం నాడు దాదాపుగా ఆరు లక్షల డాలర్లు వసూళ్లు అయినట్లుగా తెలుస్తోంది. ఇక శని, ఆదివారాల్లో మరింతగా సినిమాకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.
మౌత్ టాక్ తో యూఎస్ లో భారీగా వసూళ్లు పెరిగిన విధంగానే ఇతర ప్రాంతాల్లో కూడా 2.ఓ కు మంచి ఆధరణ దక్కుతోంది. మొదటి వారాంతం పూర్తి అయ్యేప్పటికి 450 నుండి 500 కోట్ల వసూళ్లను ఈ చిత్రం చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రజినీకాంత్ - అక్షయ్ కుమార్ లు నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. లైకా ప్రొడక్షన్స్ వారు 550 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.