Begin typing your search above and press return to search.
2.ఓ తెలుగు 100కోట్లు తెస్తుందా?
By: Tupaki Desk | 1 Nov 2018 4:18 AM GMTసినిమా బిజినెస్ అంటే పాము- నిచ్చెన (స్నేక్ & లాడర్) ఆటలాంటిది. అయితే అటు - లేకపోతే ఎటో. ఈ ఆట ఆడాలంటే చాలా గట్స్ ఉండాలి. ఒకేసారి నిచ్చెన ఎక్కి స్కైని టచ్ చేసినా - లేదూ పాతాళానికి దిగజారిపోయినా.. రెండిటినీ తట్టుకుని బ్యాలెన్స్ చేసేవాళ్లే మొనగాళ్లుగా నిలుస్తారు. ఈ ఆటలో ఏళ్ల తరబడి ఆడి ఆడి అలసిసొలసి పోయిన దిగ్గజాలు టాలీవుడ్ లో ఉన్నారు. ఆ నలుగురు ఆ బాపతే. ఆడి ఆడి తలపండిన నిపుణులుగా మారారు. కోట్లకు కోట్లు ఒకే రాత్రిలో పోగొట్టుకుంటారు. కోట్లకు కోట్లు ఓవర్ నైట్ లోనే రాబట్టుకుంటారు. ఈ ఆట యూనిక్.
ఇప్పుడు ఆ తరహాలోనే 2.ఓ (రోబో2) ఆట ఆడుతున్నారు ఓ ముగ్గురు. ఈ నవంబర్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న రజనీకాంత్- శంకర్ కాంబినేషన్ మూవీ `2.ఓ` తెలుగు రైట్స్ ని కొనుక్కున్న ఎన్.వి.ప్రసాద్- దిల్ రాజు- యువి క్రియేషన్స్ వంశీ (ఎన్ విఆర్ సినిమా) ఈ ఆటలో రాటుదేలిన మేటి పనిమంతులు. అందుకే ఏషియన్ పిక్చర్స్ సునీల్ నారంగ్ వదులుకున్న 2.ఓ తెలుగు రైట్స్ ని ఆ ముగ్గురూ ఛేజిక్కించుకున్నారు. అందుకు ఎన్.వి.ప్రసాద్ లైకా సంస్థతో సంప్రదింపులు జరిపి పని పూర్తి చేశారట. దాదాపు 80కోట్లు వెచ్చించి 2.ఓ తెలుగు రైట్స్ ని ఛేజిక్కించుకున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేస్తుంది? అంటే మినిమంగా 100కోట్ల షేర్(మ్యాగ్జిమం ఎంతైనా) వసూలు చేస్తుందనేది ఈ త్రయం ఆలోచన అని తెలుస్తోంది.
`బాహుబలి 2` రేంజు ఊపు కొనసాగితే అమాంతం నాలుగైదు రెట్లు లాభాలు ఉంటాయన్నది వీళ్ల అంచనా. బాహుబలి 2 ఏపీ, నైజాం - 140కోట్ల బిజినెస్ చేస్తే - దాదాపు 200కోట్లు పైగా వసూలు చేసింది. మొదటి రోజు 50కోట్లు - తొలి వీకెండ్ 75కోట్లు షేర్(100కోట్లు పైగా గ్రాస్) వసూలు చేసి - డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. ఇప్పుడు 2.ఓ చిత్రం అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందనేది ఎన్ విఆర్ సినిమా అధినేతల ఆలోచన అని తెలుస్తోంది. అంటే 2.ఓ 100కోట్ల లక్ష్యం కాదు - 200కోట్ల వసూళ్ల లక్ష్యం నిర్ధేశించారన్నమాట. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ క్రేజు నెలకొంది. రోబో లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన శంకర్ పై నమ్మకం తెలుగు రాష్ట్రాల్లోనూ బలంగానే ఉందని విశ్వసిస్తున్నారు. రజనీ గత చిత్రాల రిజల్టుతో పని లేకుండా శంకర్ ఇమేజ్ తో ఆ స్థాయి వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో తెస్తుందని అంచనా వేస్తున్నారు.