Begin typing your search above and press return to search.

500 కోట్లలో 370కోట్లు వెన‌క్కి?

By:  Tupaki Desk   |   24 Nov 2018 4:07 AM GMT
500 కోట్లలో 370కోట్లు వెన‌క్కి?
X
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ - శంక‌ర్- అక్ష‌య్ కుమార్ క్రేజీ కాంబినేష‌న్ మూవీ 2.ఓ మ‌రో ఐదు రోజుల్లో(నంబ‌ర్ 29) సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 500కోట్ల‌ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌ కి ముందే నిర్మాత‌ల‌కు సేఫ్ ప్రాజెక్ట్ అన్న లెక్క‌లు తేలాయి. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల మార్గాల్లో దాదాపు 370 కోట్ల మేర పెట్టుబ‌డులు వెన‌క్కి వ‌చ్చేశాయి. 2.ఓ ప్రీబిజినెస్ స్టాటిస్టిక్స్‌ ఎలా ఉన్నాయి? అన్న‌ది ప‌రిశీలిస్తే.....

శాటిలైట్ హ‌క్కులు- 120 కోట్లు (అన్ని వెర్ష‌న్లు) - డిజిట‌ల‌ర్ రైట్స్- 60కోట్లు (అన్ని వెర్ష‌న్లు) - ఉత్త‌రాది రిలీజ్ రైట్స్‌- 80కోట్లు - ఏపీ-తెలంగాణ హ‌క్కులు-70కోట్లు - క‌ర్నాట‌క హ‌క్కులు-25కోట్లు - కేర‌ళ -15కోట్లు .. ప‌లికింద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ప్రఖ్యాత క్రిటిక్ 2.ఓ బిజినెస్ వివ‌రాల్ని అందించారు. ఇక త‌మిళ‌నాడు - ఓవ‌ర్సీస్ రిలీజ్‌ హ‌క్కుల విష‌య‌మై లైకా సంస్థ నుంచి స‌రైన స‌మాచారం లేదు. ఆ రెండు ఏరియాల హ‌క్కులు క‌లుపుకుంటే బ‌డ్జెట్ మొత్తం రికవ‌రీ అయిన‌ట్టేన‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కేవ‌లం తొలివారం భారీ క‌లెక్ష‌న్లు సాధిస్తే ఈ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అంత క‌ష్ట‌మేమీ కాద‌న్న మాటా వినిపిస్తోంది.

ఇటీవ‌లే రిలీజైన `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఓపెనింగులు సాధించినా చివ‌రికి చెత్త‌ రిజ‌ల్ట్‌ తో స‌రిపెట్టుకుంది. అయితే 2.ఓ విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా బాహుబ‌లి 2 త‌ర‌హా మ్యాజిక్ చేస్తుందా? 3-4 వారాలు ఏక‌బిగిన బాక్సాపీస్‌ వ‌సూళ్లు తెస్తుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌లే రిలీజైన చిన్న సినిమా `బ‌దాయి హో` చిత్రం `థ‌గ్స్‌`ను సైతం వెన‌క్కి నెట్టి రికార్డ్ విజ‌యం సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ చెబుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 200కోట్ల నెట్ వ‌సూలు చేసింద‌ని చెబుతున్నారు.