Begin typing your search above and press return to search.
`జాన్` కోసం 80 కోట్లతో 20 సెట్లు
By: Tupaki Desk | 31 March 2019 4:57 AM GMTడార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో `జాన్` (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యూరప్ నేపథ్యంలో ఆసక్తికర ప్రేమకథా చిత్రమిదని చెబుతున్నారు. అందుకే మెజారిటీ భాగం ఈ చిత్రాన్ని యూరప్ లోని రకరకాల లొకేషన్లలో తెరకెక్కించారు. ఇటలీ, రోమ్ వంటి నగరాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాలో నటిస్తూనే డార్లింగ్ ప్రభాస్ ఈ ప్రేమకథా చిత్రంలో నటిస్తుండడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పాత కాలం వింటేజ్ కార్ల వ్యాపారి అయిన ప్రభాస్ జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ప్రవేశించాక ఏం జరిగింది? అన్నదే కథాంశం అని ఇదివరకూ లీకులు అందాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తోంది. `సాహో` చిత్రాన్ని నిర్మిస్తున్న సాహో లాంటి భారీ సినిమా తీస్తూనే గోపి కృష్ణ బ్యానర్ తో కలిసి యువి సంస్థ ఈ సాహసం చేస్తుండడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. జాన్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో కళాదర్శకుడు రవీందర్ రెడ్డి ఏకంగా రోమ్ నగరాన్ని సృష్టిస్తున్నారని తెలుస్తోంది. అచ్చం యూరప్ దేశమైన రోమ్ కల్చర్ ని, ఆర్కిటెక్చర్ ని ప్రతిబింబించేలా మొత్తం 20 సెట్స్ ని డిజైన్ చేస్తున్నారట. ఇందుకోసం ఏకంగా 60కోట్లు ఖర్చు చేస్తుండడం షాకిస్తోంది. మరో రెండు సెట్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం హైదరాబాద్ లో వేస్తున్న సెట్స్ కే 80కోట్లు ఖర్చు అంటే .. మొత్తం బడ్జెట్ ఎంతో? అంటూ అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. రోమ్ నగరం అంటేనే చారిత్రకంగా ఎంతో విశిష్టమైనది. రోమ్ వెళితే రోమన్ లా ఉండాలన్నది ప్రసిద్ధి. అకడమిక్ సోషల్ పాఠాల్లో రోమన్ల చరిత్రకు విశిష్ఠ స్థానం ఉంది. అందుకే ఈ సెట్స్ ని కళాదర్శకుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డిజైన్ చేస్తున్నారని, ఇవి సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలిసింది.
ప్రతిష్ఠాత్మక `సాహో` చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా, జాన్ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఇవి రెండూ ఎంతో ఇంపార్టెంట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే సాహో పోస్టర్లు, మేకింగ్ వీడియోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. అయితే జాన్ టైటిల్ లాంచ్ గురించి కానీ, ఇతరత్రా సమాచారం కానీ అధికారికంగా ఇంకా రివీల్ కాలేదు. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.