Begin typing your search above and press return to search.
2.ఓ డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?
By: Tupaki Desk | 16 Feb 2019 7:24 AM GMTసంక్రాంతి సినిమాలన్నీ డిజిటల్ లో లైవ్ అయిపోయాయి. పండగలో చూడడం మిస్సయిన వాళ్లంతా డిజిటల్ వీక్షణకు ఆసక్తి కనబరిచారు. కథానాయకుడు - ఎఫ్ 2 లైవ్ లోకి వచ్చాయి. పండగ సినిమాల్ని క్లీన్ స్వీప్ చేసి రిలీజ్ చేయడంలో ప్రఖ్యాత లైవ్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ తనకు తానే పోటీ అని నిరూపిస్తోంది. అయితే సంక్రాంతికి ముందే రిలీజైన సంచలనాల 2.ఓ డిజిటల్ రిలీజ్ ఎప్పుడు? అంటే ఇంతవరకూ సరైన సమాధానం లేదు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. 2.ఓ చిత్రాన్ని మార్చిలో లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ సన్నాహాలు చేస్తోందట. ఆ మేరకు సన్నిహితుల సమాచారం అందింది. అయితే 2.ఓ చిత్రం డిజిటల్ వేదికగా ఏ మేరకు విజయం సాధిస్తుంది అన్నది ప్రశ్నార్థకం. ఇది పూర్తిగా 3డి టెక్నాలజీ బేస్ చేసుకుని తెరకెక్కించిన ఫాంటసీ సైఫై ఫిక్షన్ సినిమా. ఇలాంటి వాటిని 3డి థియేటర్లలో చూస్తేనే కిక్కు. అలాంటప్పుడు అమెజాన్ డిజిటల్ రిలీజ్ చేసినా జనాదరణ ఉంటుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.
మరోవైపు 2.ఓ లాంటి భారీ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు పైగా వెచ్చించి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం 55 కోట్ల షేర్ మార్క్ మాత్రమే సాధించిందని అప్పట్లో ప్రచారమైంది. హిందీలో ఘనవిజయం సాధించిన 2.ఓ చిత్రం అటు తమిళంలో ఫ్లాపైంది. ఇటు తెలుగు లో అబౌ యావరేజ్ గా ఆడింది. అయితే థియేటర్లకు వెళ్లి చూడలేని వారంతా ఇప్పుడు డిజిటల్ లో వీక్షించే వీలుంది. లైవ్ స్ట్రీమింగ్ కి ఎంతో సమయం లేదని తెలుస్తోంది. మరో వారంలో 2.ఓ డిజిటల్ రిలీజ్ కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే వీలుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సక్సెసైందని చెప్పుకున్న అండర్ వాటర్ ఫిలిం `ఆక్వామేన్` సైతం మరో నెలరోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండడం ఆసక్తి పెంచుతోంది. మోగ్లీ జీవితకథ, అడవి నేపథ్యంలో వచ్చిన `జంగిల్ బుక్` తో పాటు ఆ సినిమా సీక్వెల్ వెబ్ సిరీస్ డిజిటల్ లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.