Begin typing your search above and press return to search.
48 గంటల్లో 8 కోట్ల వ్యూస్?
By: Tupaki Desk | 14 Sep 2018 4:06 AM GMTఎన్నో భారీ అంచనాల నడుమ రిలీజైన 2.ఓ టీజర్ ఊహించిన దానిని మించి సంచలనాలు సృష్టిస్తోంది. ఈ టీజర్ ని కేవలం 12 గంటల్లో ఏకంగా కోటి 47లక్షల మంది ఈ టీజర్‌ని వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇందులో 50లక్షల మంది తమిళ వ్యూవర్స్ - 40లక్షల మంది తెలుగు వ్యూవర్స్ - 50లక్షల మంది హిందీ వ్యూవర్స్ ఉన్నారు.
గూగుల్ లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉందీ టీజర్. గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది. ఓ అంచనా ప్రకారం కేవలం 48 గంటల్లోనే ఈ టీజర్‌ని 8 కోట్ల మంది వీక్షించే అవకాశం ఉందని గూగుల్ అప్ డేటెడ్ గ్రాఫ్ చెబుతోంది. అంటే ఈ సినిమా కోసం ఎంతమంది ప్రేక్షకులు ఎంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే 2.ఓ టీజర్ విషయంలో రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటే - ఇందులో అక్షయ్ ని కేవలం కొన్ని సెకన్లు మాత్రమే చూపిస్తారా? అంటూ హిందీ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఇదంతా శంకర్ ఓ ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడని భావించవచ్చు.
2.ఓ (రోబో2) టీజర్ ఓ విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందహం లేదని జనాల నుంచి కితాబు దక్కింది. అయితే అంతకంతకు పెంచేసిన అంచనాలకు తగ్గట్టు సినిమా ఆద్యంతం అంతటి విజువల్ గ్రాండియారిటీ లేకపోతేనే చిక్కు వచ్చి పడుతుంది. అలానే `ఐ` సినిమాలో బీస్ట్ పాత్రతో చేసిన మోసం శంకర్ రిపీట్ చేస్తే ఫలితం తారుమారవ్వడం ఖాయం. నవంబర్ లో రిలీజ్ కి వస్తున్న 2.ఓ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాల్ని అందుకునే కంటెంట్ సినిమాలో ఉంటుందనే భావిద్దాం. రజనీకాంత్ - అక్షయ్ కుమార్ - ఎమీ జాక్సన్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. తొలి టీజర్ లో కేవలం గ్రాఫిక్స్ మాయాజాలాన్ని మాత్రమే హైలైట్ చేశారు. పాత్రధారుల్ని తక్కువగానే చూపించారు. అక్షయ్ కుమార్ పాత్ర పరిమితంగా వదిలారు. ఎమీజాక్సన్ ని అయితే అస్సలు చూపించనేలేదు. ఆ ఇద్దరినీ దాచింది మునుముందు ప్రమోషన్ హోరెత్తించడానికేనని అర్థం చేసుకోవచ్చు.