Begin typing your search above and press return to search.
2.ఓ టీజర్...ఉత్తరాదిలో డిజాస్టర్?
By: Tupaki Desk | 17 Sep 2018 5:30 PM GMTరాజకీయాల పరంగా దక్షిణాది వారంటే ఉత్తరాది వారికి చిన్నచూపు అని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా, టాలీవుడ్ పై బాలీవుడ్ కు కూడా చిన్న చూపు ఉంది. అందుకే బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కినా....బాలీవుడ్ నుంచి మాత్రం అరకొరగా....ప్రశంసలు వచ్చాయి. కరణ్ జొహర్ వంటి కొద్దిమంది బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే బాహాటంగా టాలీవుడ్ స్టామినా పెరిగిందని అంగీకరిస్తున్నారు. అయితే, తాజాగా 2.ఓ టీజర్ విడుదల నేపథ్యంలో మరోసారి ఈ బాలీవుడ్...టాలీవుడ్ క్లాష్ వచ్చింది. ఈ టీజర్ కు దక్షిణాదిలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో....బాలీవుడ్ లో మాత్రం నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే, టీజర్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ లో క్వాలిటీ లోపించడం...ఆ టీజర్ లో అక్షయ్ కుమార్ జస్ట్ ఒక ఫ్రేమ్ లో కనిపించడం వల్ల బాలీవుడ్ జనాలకు అది రీచ్ కాలేదు.
వాస్తవానికి ఈ టీజర్ లో వీఎఫ్ ఎక్స్ వర్క్ పై కొంతమంది పెదవి విరిచారు. అయితే, థియేటర్ స్క్రీన్ లపై - 3డీలో టీజర్ ...చిన్న చిన్న లోపాల మినహా బాగానే ఉంది. కానీ, కంప్యూటర్లు - ల్యాప్ టాప్ లు వంటి చిన్న స్క్రీన్లలో ఆ ఎఫెక్ట్స్ అంతగా కనిపించలేదు. దీనికి తోడు అక్షయ్ కుమార్ ....నిడివి చాలా తక్కువగా ఉండడంతో బాలీవుడ్ లో టీజర్ కు నెగెటివ్ టాక్ వచ్చింది. వరుస హిట్లతో దూసుకుపోతోన్న అక్కీని ఆ టీజర్ లో హైలైట్ చేయకపోవడం....ఉత్తరాది వారికి రుచించలేదు. ఆ టీజర్ ను బట్టి ఆ సినిమాలో అంతా రజనీ షో ఉంటుందని....అక్కీ పాత్ర ఏమీ లేదని వారు డిసైడ్ అయ్యి డిజప్పాయింట్ అయ్యారు. అసలే ...దక్షిణాది వారి వంకల కోసం వెతికే ఉత్తరాది జనం....టీజర్ కు నెగెటివ్ టాక్ తెచ్చి తమ కక్షను తీర్చుకున్నారు. మరి, ట్రైలర్ లో అయినా ఈ లోపాలు సరిచేసుకొని శంకర్ బాలీవుడ్ , ఉత్తరాది జనాల నోరు మూయిస్తాడేమో వేచి చూడాలి. ఇక, సినిమాలో అక్షయ్ పాత్ర నిడివి...ప్రాముఖ్యతను బట్టి బాలీవడు లో ఈ సినిమా టాక్ ఉండే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.