Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఊహకందని మాయాజాలం

By:  Tupaki Desk   |   3 Nov 2018 7:28 AM GMT
ట్రైలర్ టాక్: ఊహకందని మాయాజాలం
X
సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శక దిగ్గజం శంకర్ కాంబోలో రూపొందిన ఇండియాస్ మోస్ట్ కాస్ట్ ఫిలిం 2.0 ట్రైలర్ అట్టహాసంగా చెన్నైలో టీమ్ తో పాటు అభిమనుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. రెండు నిముషాలు పాటు ఉన్న ట్రైలర్ లో టీజర్ షాట్స్ కొన్ని రిపీట్ అయినప్పటికీ మొత్తంగా శంకర్ తన టెక్నీకల్ మాయాజాలంతో మరిపించేసాడు. ట్రైలర్ లో కథను లీలగా చూపించే ప్రయత్నం జరిగింది. శంకర్ ఈసారి సెల్ ఫోన్ ని విలన్ కు ఆయుధంగా మలిచాడు.

ప్రపంచంలో సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు హంతకులే అని విచిత్రమైన కాకి లాంటి గద్ద పోలికలున్న అక్షయ్ కుమార్ పాత్ర ద్వారా చెప్పించిన శంకర్ కథలో మెయిన్ పాయింట్ ని సెల్ ఫోన్ టెక్నాలజీ ద్వారానే రాసుకున్నట్టు అర్థమవుతోంది. అమీ జాక్సన్ రోబోను రూపొందించే క్రమంలో సైంటిస్ట్ రజనికి అసిస్టెంట్ గా కనిపించగా ట్రైలర్ మొత్తం రజని అక్షయ్ లతోనే నిండిపోయింది.

ఊహకందని అతి పెద్ద ఆకారంతో ఉన్న గద్ద లాంటి పక్షి నగరంలో చేస్తున్న భీభత్సం-రజని వెంట పడుతూ అతన్ని అంతమొందించే ప్రయత్నం చేయడం- జనం భయంతో పరుగులు తీయడం-స్టేడియం లో రోబో అక్షయ్ లు ఆకాశాన్ని తాకే ఆకారాలతో భీకరమైన పోరాటానికి పాల్పడటం అంతా ఏదో వింత లోకం లో విహరించిన అనుభూతి కలిగించింది. సెల్ ఫోన్ వాడకమే లేకుండా చేసి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని శాశించాలని నాశనానికి బయలుదేరిన అక్షయ్ కుమార్ ని 2.0 ఎలా నిలువరించాడు అనేదే ఇందులో కీ పాయింట్.

సూపర్ పవర్ రోబోట్ ని ఫిఫ్త్ ఫోర్స్(ఐదో శక్తి)గా అభివర్ణించిన శంకర్ కీలకంగా చెప్పబడుతున్న క్లైమాక్స్ తాలూకు స్టేడియం విజువల్స్ తో మతి పోగొట్టినంత పని చేసాడు. రెహమాన్ మ్యూజిక్ ఎప్పటిలాగే హాలీవుడ్ స్థాయిలో ఉంది. కెమెరా వర్క్ కు స్టన్నింగ్ అనే మాట సరిపోదు. చిన్ని తెరపై చూస్తేనే ఇలా ఉంది. త్రీడి గ్లాసెస్ తో ధియేటర్ లో కూర్చుని చూస్తే ఆ అనుభూతికి మాటలు కష్టమేనేమో. మొత్తానికి 29న విడుదలకు ఇంకో 26 రోజులు ఎదురు చూడటం భారం అనిపించేలా ఎగ్జైటింగ్ గా కట్ చేసిన ట్రైలర్ తో అంచనాలు అంతరిక్షాన్ని దాటేశాయి.