Begin typing your search above and press return to search.
20 ఏళ్ల క్రితం నాటి PSPK యాడ్ వైరల్ !
By: Tupaki Desk | 12 Sep 2022 10:35 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోలంతా బ్రాండింగ్స్ లో దూసుకుపోతున్నారు. మహేష్.. బన్నీ...తారక్..చరణ్ అంతా కమర్శియల్ యాడ్స్ చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఆ విషయంలో మహేష్..బన్నీ మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. టాలీవుడ్ నుంచి బ్రాండింగ్స్ కి పెట్టింది పేరుగా ఉన్న మహేష్ కి పోటీగా బన్నీ తయరయ్యారు. పాన్ ఇండియా చిత్రం పుష్ప చిత్రంతో వచ్చిన క్రేజ్ తో బన్నీ బ్రాండింగ్ రేంజ్ పెరిగింది.
బ్యాలెన్స్ ఎండార్స్ ఏమైనా ఉంటే తారక్..చరణ్ ..రానా...చిరంజీవి...నాగార్జున..వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు చుట్టేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్....పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం బ్రాండింగ్స్ కి తొలి నుంచి దూరంగానే ఉంటున్నారు. కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఎలాంటి ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడానికి ముందుకు రాని స్టార్లగా ఇద్దరికీ పేరుంది.
నేటి సోషల్ మీడియా ఎరాలో కూడా ఇలా దూరంగా ఉండటం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా? నమ్మాల్సిన నిజమిది. ఎవరి వ్యక్తిగత కారణాలుగా వారు ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం పెప్సీయాడ్ లో నటించారు. కొన్నాళ్ల పాటు ఆ బ్రాండ్ని మార్కెట్ లో బాగానే ప్రమోట్ చేసారు. అదే అతని మొదటి యాడ్.. ఆయన చివరి యాడ్ కూడా.
తానే తాగని పానియం గురించి జనాల్ని తాగమని ఎలా? చెబుతానని అప్పటి నుంచి యాడ్స్ చేయడం మానేసారు. ఆ తర్వాత చాలా కంపెనీలు ఆఫర్ చేసినా వాటిని సున్నితంగా తిరస్కరించారు.ఎండార్ మెంట్స్ ద్వారా కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా మనసుకు ఇష్టం లేని కొన్ని పనులు చేయలేనంటూ వాటి నుంచి తప్పించుకుంటున్నారు.
తాజాగా ఆ నాటి పెప్సీ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో పవన్ ని చూసుకుని అభిమానులు మురిసిపోతున్నారు. పవన్ 20 ఏళ్ల క్రితం..20ఏళ్ల తర్వాత ఒకేలా ఉన్నారంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అప్పట్లో ఫేస్ బుక్..ట్విటర్..ఇన్ స్టా.
యూ ట్యూబ్ లాంటి మాధ్యమాలు లేవు. కేవలం ఆ యాడ్ టీవీలో..సినిమా ప్రసారానికి ముందు మాత్రమే కనిపించేది. ఇప్పుడు అదే యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా కామెంట్ బాక్సులో పవన్ ఔన్నత్యాన్ని..గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.