Begin typing your search above and press return to search.
ఎవర్ గ్రీన్ హీరోయిన్ గతం మరిచిన వేళ..
By: Tupaki Desk | 17 Oct 2018 3:30 PM GMTబాలీవుడ్లోనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాల్లో ‘కుచ్ కుచ్ హోతా హై’ ఒకటి. 1998లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇండియాలో మరెన్నో ముక్కోణపు ప్రేమ కథా చిత్రాలకు ఇది స్ఫూర్తిగా నిలిచింది. అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ దర్శకుడిగా పరిచయం అయింది ఈ చిత్రంతోనే. షారుక్ ఖాన్.. కాజోల్.. రాణీ ముఖర్జీ ఇందులో ప్రధాన పాత్రలో పోషించారు. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ముంబయిలో కరణ్ ఒక పెద్ద వేడుక ఏర్పాటు చేశారు. అప్పటి యూనిట్ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్ ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ చిత్రంలో ఒక కథానాయికగా నటించిన ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజల్ కు అప్పట్లో చేదు అనుభవం ఎదురైందట.
ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా కాజోల్ ఓ ప్రమాదానికి గురైందని.. దీంతో ఆమె తలకు దెబ్బ తగిలి కొంత కాలం పాటు గతం మరిచిపోయిందని అతను తెలిపాడు. ఈ సినిమాలోని ‘యే లడ్కా హై దివానా’ పాటలో కాజోల్ - షారుక్ సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు. ఈ షాట్ చిత్రీకరిస్తుండగా.. కాజోల్ ప్రమాదవశాత్తు కిందపడిపోయిందట. ఆమె తలకు.. ముఖానికి గాయమై స్పృహ కోల్పోయిందట. చాలా సేపు ఆమె అలానే ఉండిపోయిందట. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజులపాటు ఆమె తన గదిలోనే కూర్చుని ఏడ్చేదని.. అప్పుడామె గతం కూడా మరిచిపోయిందని.. అప్పటికే పెళ్లికి కమిటైన తన కాబోయే భర్త అజయ్ దేవగణ్ ను తప్ప ఆ కొన్ని రోజులు ఎవర్నీ గుర్తు పట్టేది కాదని.. దీంతో తామంతా ఎంతో కంగారు పడ్డామని.. ఐతే కొన్నాళ్లు చికిత్స తీసుకున్నాక కాజల్ మామూలు మనిషైందని కరణ్ వెల్లడించాడు.