Begin typing your search above and press return to search.
200 కోట్ల దోపిడీ.. జాక్విలిన్ పోస్ట్ వెనక రహస్యం
By: Tupaki Desk | 18 Aug 2022 4:38 AM GMTబాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ గురించి తెలిసిందే. తనపై దోపిడీ కేసు నమోదు చేసిన తర్వాత జాకీ తాజాగా ఒక రహస్య పోస్ట్ ను షేర్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ సందేశం కలకలం రేపింది. నిజానికి జాకీ ఒక స్ఫూర్తిదాయకమైన కోట్ ను షేర్ చేసింది. 'డియర్ మి' అని సంబోధించిస్తూ... బలంగా ఉండటం.. లక్ష్యాలను సాధించడం గురించి తన కలల్ని వెల్లడించింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియా లో తన మనసులో ఉన్న రహస్యాన్ని ఎంతో క్రిప్టిక్ గా బయటపెట్టారు. ఈ పోస్ట్ తో తన ఫాలోవర్స్ దృష్టిని ఆకర్షించింది. 'ప్రియమైన నాకు' అని సంబోధిస్తూ ఒక నోట్ ను షేర్ చేసింది. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో కాన్ మాన్ గా పాపులరైన సుకేష్ చంద్రశేఖర్ తో వ్యవహారంలో జాక్విలిన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో జాకీ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ఆ క్రిప్టిక్ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. "ప్రియమైన నాకు.. నేను అన్ని మంచి పనులకు అర్హురాలిని. నేను శక్తివంతురాలిని.. నన్ను నేను అంగీకరిస్తున్నాను.. అంతా ఓకే అవుతుంది. నేను బలంగా ఉన్నాను.. నేను నా లక్ష్యాలను సాధిస్తాను..కలలను నిజం చేస్తాను..''అని నోట్ లో రాసింది జాకీ. అంతకుముందు రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛార్జిషీట్ ను సమర్పించింది. అందులో వారు సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితులలో ఒకరిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను పేర్కొన్నారు. అంతేకాకుండా మనీ ట్రయల్ ను క్షుణ్ణంగా విచారించిన తర్వాత జాక్విలిన్ పేరును చేర్చినట్లు కూడా ఛార్జిషీట్ పేర్కొంది.
రాన్ బాక్సీ మాజీ యజమాని భార్య అదితి సింగ్ నుండి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ - జాక్విలిన్ అలాగే ఆమె కుటుంబంపై డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు తెలిసింది. గతంలో ఈడీ సమర్పించిన వివరాల ప్రకారం.. మొత్తం రూ. 7 కోట్లు విలువ చేసే ఆస్తులు బహుమతులను జాక్వెలిన్ కు తన సహచరి పింకీ ఇరానీ ద్వారా మోసగాడు సుఖేష్‌చంద్ర ఇచ్చినట్లు భావిస్తున్నారు. జాక్విలిన్ కుటుంబ సభ్యులకు కూడా సుకేష్ డబ్బు అప్పుగా ఇచ్చాడని ఆ ప్రకటన పేర్కొంది.
గతంలో సుఖేష్- పింకీల నేర కార్యకలాపాలతో సంబంధం గురించి తనకు ఏమీ తెలియదని జాకీ ఇంతకుముందు విచారణలో అన్నారు. తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించారు. అయితే ప్రస్తుత నివేదికల ప్రకారం.. ఆమె అందుకున్న బహుమతులు దోపిడీ నుండి వచ్చిన ఆదాయమని జాకీకి ముందే తెలుసునని ED ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో సుకేష్ భార్య లీనా మరియా పాల్ సహా ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు.
బాలీవుడ్ లోని అత్యంత అందమైన నటీమణులలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ అద్భుతమైన విజువల్స్ సెన్స్ తో జాకీ ఎప్పుడూ తన అభిమానుల హృదయాలను ఆకర్షించింది. కిక్- మర్డర్ 2- జుడ్వా 2- రేస్ 2- హౌస్ ఫుల్ సిరీస్- బచ్చన్ పాండే సహా అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. జాకీ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో హెడ్ లైన్స్ లోకి వచ్చింది. జాక్విలిన్ కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్ తో రిలేషన్ లో ఉంది. సుఖేష్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల దోపిడీ.. మనీలాండరింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు.
ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీట్ లో తన క్లయింట్ పేరు ఉండటంపై జాక్వెలిన్ తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఆమె న్యాయవాది రాతపూర్వక వివరణలో ఈడీ నుండి తమకు అధికారిక సమాచారం అందనప్పుడు మీడియా నివేదికల ద్వారా ఛార్జిషీట్ లో తమ క్లయింట్ పేరు ప్రస్తావించారరని వారు ఎలా తెలుసుకున్నారు? మీడియా కథనాలు నిజమైతే తన క్లయింట్ ను నిందితురాలిగా చేర్చడం దురదృష్టకరమని ముఖ్యంగా ఆమె మొదటి నుండి చాలా సహకరిస్తున్నారని న్యాయవాది అన్నారు.
తన క్లయింట్ బాధితురాలని.. ఆమె మోసానికి గురైందని.. దోపిడీ రాకెట్ లో భాగం కాదని అతను చెప్పాడు. జాక్వెలిన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. "వాదనల అనంతరం మొత్తం ప్రాసిక్యూషన్ కేసు నిజమని భావించినా కానీ మనీలాండరింగ్ నిరోధక చట్టం లేదా అమలులో ఉన్న మరేదైనా చట్టం కింద జాక్వెలిన్ పై ఎటువంటి కేసు నమోదు చేయలేరు. ఇది మాలాఫైడ్ ప్రాసిక్యూషన్ కేసు .. నా క్లయింట్ తన గౌరవం స్వేచ్ఛను రక్షించడానికి చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాం'' అని అన్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పందన కోసం ప్రస్తుతం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాక్వెలిన్ లాయర్ చెప్పినదాని ప్రకారం ఆమె గౌరవం స్వేచ్ఛను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాక్వెలిన్ చివరిసారిగా కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనాలో కనిపించింది. తదుపరి రామ్ సేతులో అక్షయ్ కుమార్ -నుష్రత్ భరుచ్చా తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి విడుదలవుతుంది. అజయ్ దేవగన్- సిద్ధార్థ్ మల్హోత్రా -రకుల్ ప్రీత్ 'థాంక్స్ గాడ్' అదే రోజు విడుదల కానుండగా పోటీకి దిగనుంది.