Begin typing your search above and press return to search.

#2019-22.. మూడేళ్లుగా ముక్కుతూ మూలుగుతున్న మ‌ల్టీస్టార‌ర్లు!

By:  Tupaki Desk   |   25 May 2021 7:30 AM GMT
#2019-22.. మూడేళ్లుగా ముక్కుతూ మూలుగుతున్న మ‌ల్టీస్టార‌ర్లు!
X
2019లో మొద‌లైన‌ టాప్ 5 మ‌ల్టీస్టార‌ర్స్ ఇప్ప‌టికీ రిలీజ్ కాక‌పోవ‌డం అభిమానుల్లో నిరాశ‌ను పెంచుతోంది. 2018లో ప్రీప్రొడ‌క్ష‌న్ ప్రారంభించి 2019లో ప్రారంభ‌మై.. ద‌శ‌ల‌వారీగా తెర‌కెక్కుతూ క‌రోనా రెండు వేవ్ ల‌తో వాయిదాల ప‌ద్ధ‌తిలో రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఓ నాలుగైదు మ‌ల్టీస్టార‌ర్లు ఫ్యాన్స్ కి అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. వందేళ్ల భార‌త‌దేశ చ‌రిత్ర‌లో అసాధార‌ణ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కుతున్న క్రేజీ సినిమాలు స‌జావుగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయా లేదా? అన్న‌ది సందిగ్ధంగా మారింది.

ఆర్.ఆర్.ఆర్- బ్ర‌హ్మాస్త్ర‌- మ‌ర‌క్క‌ర్-83 చిత్రాల వెయిటింగ్ గురించి ఇటీవ‌ల‌ క్రిటిక్స్ ప్ర‌ముఖంగా ప్ర‌స్థావిస్తున్నారు. ఎస్.ఎస్.రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ మూడేళ్లుగా తెర‌కెక్కుతూనే ఉంది. 2020 జూలై 20న ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ త‌ర్వాత ఏడాది కాలంగా వ‌రుస‌గా రిలీజ్ తేదీల్ని లాక్ చేస్తున్నా ఏదీ కుద‌ర‌డం లేదు. 2021 ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేస్తామ‌ని చెబుతున్నా అది కూడా సాధ్య‌ప‌డుతుందా లేదా? అన్న సందిగ్ధత నెల‌కొంది. లాక్ డౌన్ వ‌ల్ల పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌వ్వ‌డం ఆల‌స్య‌మ‌వుతోంది.

ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని దాదాపు 350 -400 కోట్ల బ‌డ్జెట్ తో డీవీవీ దాన‌య్య‌ నిర్మిస్తున్నారు. ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కూ 2.0 త‌ర్వాత మళ్లీ అంత పెద్ద బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న సినిమాగా ఆర్.ఆర్‌.ఆర్ రికార్డుల‌కెక్కుతోంది. చ‌ర‌ణ్‌- తార‌క్- ఆలియా- అజ‌య్ దేవ‌గ‌న్ వంటి భారీ తారాగ‌ణంతో ఆర్‌.ఆర్‌.ఆర్ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే బిజినెస్ పూర్త‌యింద‌ని చెబుతున్నా రిలీజ్ డైల‌మా అభిమానుల్ని క‌న్ఫ్యూజ్ చేస్తోంది.

ఇక ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత ఒక మోస్త‌రు పెద్ద బ‌డ్జెట్ల‌తో రూపొందుతున్న చిత్రాలుగా బ్ర‌హ్మాస్త్ర- మ‌ర‌క్క‌ర్ (మ‌ల‌యాళం)-83 చిత్రాల పేర్లు మార్మోగిపోతున్నాయి. అమితాబ్ బ‌చ్చ‌న్- ర‌ణ‌బీర్ క‌పూర్- ఆలియాభ‌ట్- నాగార్జున వంటి భారీ తారాగణంతో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ - ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న బ్ర‌హ్మాస్త్ర చిత్రానికి దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నారు. లాక్ డౌన్ల వ‌ల్ల ఈ బ‌డ్జెట్ అద‌నంగా పెరిగింద‌ని స‌మాచారం. క‌ర‌ణ్ జోహార్ నేతృత్వలోని మ‌రో భారీ ఫిక్ష‌న్ చిత్రం బ్ర‌హ్మాస్త్ర లోనూ ఆలియా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బ్ర‌హ్మాస్త్ర 2020 డిసెంబ‌ర్ 20న రిలీజ్ కావాల్సి ఉండ‌గా షూటింగ్ డిలే వ‌ల్ల అప్ప‌టికి వ‌స్తుందా రాదా? అన్న‌ది సందిగ్ధంగా మారింది. మూడేళ్లుగా ఈ సినిమా ఒక కొలిక్కి రాక‌పోవ‌డం అభిమానుల్ని నిరాశ‌ప‌రుస్తోంది.

మోహ‌న్ లాల్ - నాగార్జున- సునీల్ శెట్టి- అర్జున్ షార్జా- సిద్ధిఖి- ప్ర‌భుదేవా- సుదీప్ వంటి భారీ స్టార్ల‌ కాంబినేష‌న్ లో ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `మ‌ర‌క్క‌ర్` (మ‌లయాళం) చిత్రానికి దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్ ని కేటాయించారు. కానీ ఆల‌స్యం అవ్వ‌డంతో ఈ సినిమా బ‌డ్జెట్ అమాంతం పెరిగింద‌ని తెలిసింది. ఆశీర్వాద్ సినిమాస్- మూన్ షాట్ ఎంట‌ర్ టైన్ మెంట్స్- కాన్ఫిడెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2020లో రిలీజ్ కావాల్సి ఉండ‌గా మార్చి.. మే అంటూ రిలీజ్ తేదీలు మారాయి. ఇప్ప‌టికీ రిలీజ్ పై డైల‌మా నెల‌కొంది.

1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీ నేప‌థ్యాన్ని క‌పిల్ దేవ్ బ‌యోపిక్ రూపంలో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌బీర్ క‌పిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అత‌డి భార్య‌గా దీపిక ప‌దుకొనే తెర‌పైనా నటిస్తున్నారు. ఈ సినిమాని మూడేళ్లుగా తెర‌కెక్కిస్తున్నా రిలీజ్ డైల‌మా ఎదుర‌వుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్ర‌భావంతో ఇప్ప‌టికీ రిలీజ్ పై స్ప‌ష్ఠ‌త లేకుండా పోయింది. క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా మూడేళ్ల క్రిత‌మే ప్రారంభ‌మైన తక్త్ చిత్రం టోట‌ల్ స్క్రాప్ అయ్యింది. ఇవ‌న్నీ పాన్ ఇండియా కేట‌గిరీలో రావాల్సిన మ‌ల్టీస్టార‌ర్లు కావ‌డంతో జాతీయ స్థాయిలో ఆస‌క్తి నెల‌కొంది. జాన్వీ క‌పూర్ స‌హా ప‌లువురు అగ్ర తారాగ‌ణంతో ఈ మూవీని ప్ర‌క‌టించిన క‌ర‌ణ్ జోహార్ ఆ త‌ర్వాత వెన‌క‌డుగు వేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. లాక్ డౌన్ల ప్ర‌భావం ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ పై తీవ్రంగానే ప‌డింద‌న్న ప్ర‌చారం సాగుతోంది.