Begin typing your search above and press return to search.
2021 బెస్ట్ మూవీ..ఓవర్‌రేటెడ్..డిజాస్టర్ ఇవే
By: Tupaki Desk | 31 Dec 2021 12:30 PM GMTఈ ఏడాది మొత్తం 200 పై చిలుకు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని డైరెక్ట్ ఓటీటీ బాట పట్టాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ లు వున్నాయి. ఇండస్ట్రీ హిట్ లని మించి పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించిన.. కురిపిస్తున్న సినిమాలు వున్నాయి. అందులో ఓవర్ రేటెడ్ ఫిల్మ్ కూడా వుంది. అంతే కాకుండా క్రేజీ కాంబినేషన్, భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిగిచి షాకిచ్చిన సినిమా కూడా వుంది. ఇంతకీ ఏమా సినిమాలు.. ఏంటా స్టోరీ.. ఒక సారి ఆ స్టోరీలోకి జర్నీ చేసేద్దాం.
ఈ జాబితాలో ఈ ఏడాది ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా `పుష్ప : ది రైజ్`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఈ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఆ పేరుకు తగ్గట్టే అతను నటించిన సినిమా పాన ఇండియా లెవెల్లో తగ్గేదేలే అన్నట్టుగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రారంభ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేసింది. తొలి రోజు దాదాపు 70 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయ పరిచింది. అంతే కాకుండా ప్రస్తుంత డ్రీమ్ రన్ తో కొనసాగుతూ ఉత్తరాదిన యమ జోరు చూపిస్తోంది.
ఉత్తరాదిన అంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ పరంగా రెండు వారాల్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బాహుబలి 2 మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో `2.ఓ`మూడవ స్థానంలో `బాహుబలి` నిలిచాయి. అయితే నాలుగవ స్థానంలో వున్న కేజీఎఫ్ ని వెనక్కి నెట్టి `పుష్ప` నాలుగవ స్థానాన్ని దక్కిచుకోవడం విశేషం. ఇలా వసూళ్లతో పాటు సినిమా పరంగానూ విశేషంగా ఆకట్టుకుంటూ ఈ ఏడాది బెస్ట్ మూవీగా నిలిచింది.
ఇక ఇదే ఏడాది థియేటర్లలో సందడి చేసిన `ఉప్పెన` బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా ఓవర్ రేటెడ్ ఫిల్హ్ జాబితాలో చేరింది. మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా ఇది. ఇదే చిత్రంతో కృతిశెట్టి, దర్శకుడిగా బుచ్చిబాబు సాన పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు పూర్తి భిన్నంగా పరువు, ప్రతీకారం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
ఒక్క సారిగా వైష్ణవ్ తేజ్ ని, కృతిశెట్టిని స్టార్ లని చేసింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్, హీరోయిన్ తండ్రి హీరోని మగాడిగా పనికి రాకుండా చేయడం వంటి అంశాల కారణంగా అందమైన ప్రేమకథే అయినా ఓవర్ రేటెడ్ ఫిల్మ్ గా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు టేకింగ్, మైత్రీ వారి మేకింగ్, దేవి అందించిన పాటలు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టాయి.
ఇక ఇదే ఏడాది భారీ డిజాస్టర్ సినిమా కూడా ఒకటి థియేటర్లలో సందడి చేసింది. కనీ వినీ ఎరుగని కాంబినేషన్ లో రూపొందినా అందులో బలమైన కథ, కథనాలు లోపించడంతో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అదే `మహా సముద్రం`. శర్వానంద్, `బొమ్మరిల్లు` సిద్ధార్ధ్ తొలి సారి కలిసి నటించిన చిత్రమిది. మల్టీస్టార్ సినిమాగా ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కథలో దమ్ము లేకపోవడంతో ఎన్ని హంగులున్నా వృధా ప్రయాసగా మారి చివరికి డిజాస్టర్ అనిపించుకుంది. `Rx100` వంటి సంచలన చిత్రం తరువాత దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేక ఉసూరుమనిపించింది.