Begin typing your search above and press return to search.

2021 NYE కొత్త పోస్టర్లతో హుషారుగా

By:  Tupaki Desk   |   1 Jan 2021 1:12 PM IST
2021 NYE కొత్త పోస్టర్లతో హుషారుగా
X
2020 ఎన్నో పాఠాల్ని నేర్పి వెళ్లింది. 2021 నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ .. మ‌హ‌మ్మారీ ప‌రిస్థితులు సాధారణ స్థితికి రావాల‌ని టాలీవుడ్ కోరుకుంటోంది. జ‌న‌వ‌రిలో వ‌రుస‌గా నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి పండ‌గ‌కు థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌ని అంచ‌నా. ఈలోగానే వ‌రుస పోస్ట‌ర్ల‌తో జ‌న‌వ‌రి 1 ని ఘ‌నంగా మొద‌లు పెట్టింది ప‌రిశ్ర‌మ‌.

2021 లో విడుదల కోసం ఎదురుచూస్తున్న నాలుగు సినిమాల కొత్త పోస్ట‌ర్లు విడుద‌ల‌య్యాయి. కొత్త పోస్టర్లతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మేక‌ర్స్ విష్ చేశారు. ఈ ఉత్సాహం నిల‌బ‌డేలా.. అందరికీ ఈ సంవత్సరం ప్రతి అంశంలోనూ మెరుగుపడాల‌ని.. ప్రధానంగా ప్రతి థియేటర్ రిలీజ్ ల‌తో హౌస్ ఫుల్స్ అవ్వాల‌ని ఆకాంక్షిద్దాం. సినీప‌రిశ్ర‌మ గాడిన ప‌డ‌డం చాలా మంది ఉపాధిని పెంచుతుంది.

ఈ ఏడాది రిలీజ్ కి రానున్న సినిమాల పోస్ట‌ర్లు విడుద‌ల‌య్యాయి. ప్రభాస్ రాధే శ్యామ్- శర్వానంద్ - శ్రీకారమ్- రవితేజా క్రాక్ .. చిత్రాల పోస్ట‌ర్లు రిలీజ‌య్యాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పోస్టర్ ఆక‌ట్టుకుంది. మ‌రిన్ని పోస్ట‌ర్లు నేడు రిలీజ్ కానున్నాయి.