Begin typing your search above and press return to search.

2022 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఇవే..!

By:  Tupaki Desk   |   27 Dec 2022 5:54 AM GMT
2022 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఇవే..!
X
ఈమధ్య స్టార్ హీరో సినిమా అంటేనే 100 కోట్లు బడ్జెట్ అవుతుంది. అలాంటిది 100 కోట్ల వసూళ్లు అనేది చాలా కామన్ అయ్యింది. ఇదివరకు సినిమా హిట్టా ఫట్టా అన్నది 100, 150, 200 రోజులతో లెక్క కట్టే వారు కానీ ఇప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లతో లెక్క కడుతున్నారు. 2022 లో ఎప్పటిలానే బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ 100 కోట్లని సునాయాసంగా దాటేసిన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ పెరగడం వల్ల తెలుగు సినిమాలే కాదు కన్నడ, తమిళ సినిమాలతో పాటుగా హిందీ సినిమాలు 100 కోట్ల మార్క్ దాటి సత్తా చాటాయి.

ఈ ఏడాది తెలుగులో 100 కోట్లు దాటిన సినిమాల లెక్క చూస్తే.. ఆ లిస్ట్ లో ముందుగా ఆర్.ఆర్.ఆర్ ఉంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటన, రాజమౌళి అద్భుత సృష్టి సినిమాను నెక్స్ట్ లెవల్ లో ఉంచాయి. ఆర్.ఆర్.ఆర్ 1100 కోట్ల పైన బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీ నిలిచింది. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా 100 కోట్ల మార్క్ దాటేసింది. అయితే సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంలో మాత్రం వెనకపడ్డది.

ఇక ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్, రానాల భీమ్లా నాయక్ కూడా ఉంది. మళయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ గా సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. 100 కోట్లపైన కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసింది. ఇదే లిస్ట్ లో ప్రభాస్ రాధే శ్యామ్ కూడా ఉంది. సినిమా ఓవరాల్ రిజల్ట్ ఫ్లాప్ అయినా 100 కోట్లు దాటి ప్రభాస్ స్టామినా చూపించింది.

ఈ ఏడాది యునానిమస్ హిట్ సినిమాల్లో ఒకటి కార్తికేయ 2. నిఖిల్, చందు మొండేటి మరోసారి తమ మ్యాజిక్ చూపించారు. ఈ సినిమా సౌత్ తో పాటుగా నార్త్ సైడ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని ఈ ఏడాది 100 కోట్ల కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ లో నిలిచింది. ఇక ఈ లిస్ట్ లో చిరు గాడ్ ఫాదర్ కూడా ఉంది. ఓవరాల్ రిజల్ట్ నిరాశపరచినా గాడ్ ఫాదర్ కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ ఏడాది తెలుగులో 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు అవి కాగా బాలీవుడ్ లో 100 కోట్లు రాబట్టిన లిస్ట్ ఒకసారి చూసేద్దాం.కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ అంత గొప్పగా కళకళలాడింది లేదు. అయితే బ్రహ్మాస్త్ర కొద్దిగా హడావిడి చేసింది. రణ్ బీర్ కపూర్, అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. 2022 లో బాలీవుడ్ లో మొదటి 100 కోట్ల కమర్షియల్ సినిమాగా నిలిచింది.

అంతకుముందు ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా పెను సంచలనం సృష్టించింది. కశ్మీర్ ఫైల్స్ కూడా 100 కోట్ల మార్క్ దాటేసింది. మళయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం ఫ్రాంచైజ్ గా వచ్చిన దృశ్యం 2 హిందీలో కూడా అద్భుతాలు సృష్టించింది. దృశ్యం 2 మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపిరి నిచ్చింది. 100 కోట్ల పైన కలెక్ట్ చేసి సత్తా చాటింది.

ఇదే కాదు భూల్ బూలియా 2, అలియా భట్ గుంగూ భాయ్ కటియావాడి, హృతిక్ రోషన్, సైఫ్ అలి నటించిన విక్రం వేద, జగ్ జగ్ జీయో, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలు 100 కోట్లు వసూలు చేశాయి. అయితే ఓవరాల్ రిజల్ట్ మాత్రం ఈ సినిమాలు నిరాశపరిచాయి.

2022 100 కోట్లు కలెక్ట్ చేసిన తమిళ సినిమాల లిస్ట్ చూస్తే..మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పి.ఎస్ 1 అనుకున్నట్టుగానే కోలీవుడ్ లో అద్భుతాలు సృష్టించింది. ఆ సినిమా తమిళనాడులో వసూళ్ల మోత మోగించింది. ఆ తర్వాత కమల్ హాసన్ విక్రం సినిమా రికార్డ్ ల గురించి తెలిసిందే. సినిమా అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యింది. 400 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది విక్రం.

దళపతి విజయ్ బీస్ట్ కూడా 100 కోట్లు కలెక్ట్ చేసి మరోసారి విజయ్ స్టామినా ప్రూవ్ చేసింది. శివ కార్తికేయన్ డాన్ సినిమా కూడా కోలీవుడ్ లో 100 కోట్లు కలెక్ట్ చేసింది. ధనుష్ నటించిన తిరుచిత్రం బలం అలియాస్ తిరు సినిమా కూడా 100 కోట్లు రాబట్టింది. కార్తీ సర్ధార్, అజిత్ వలిమై కూడా 100 కోట్ల మార్క్ దాటాయి.

2022 లో 100 కోట్ల మార్క్ దాటిన కన్నడ సినిమాల లిస్ట్ చూస్తే..ఈ ఏడాది కన్నడ పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఓ పక్క కె.జి.ఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలతో రిలీజై సూపర్ హిట్ కాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కాంతార సెన్సేషన్ హిట్ గా నిలిచింది. కాంతార మూవీ 16 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు వసూల్లను రాబట్టడం ట్రెడ్ పండితులను షాక్ అయ్యేలా చేసింది.

ఇదే క్రమంలో సుదీప్ విక్రాంత్ రానా కూడా 100 కోట్లు వసూలు చేసింది. రోహిత్ శెట్టి 777 చార్లీ సినిమా కూడా 100 కోట్ల మార్క్ దాటేసింది. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది.

తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమలో 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.