Begin typing your search above and press return to search.

2022 అమెజాన్ టాప్ 10.. ఫస్ట్ లో పుష్ప!

By:  Tupaki Desk   |   14 Dec 2022 6:30 AM GMT
2022 అమెజాన్ టాప్ 10.. ఫస్ట్ లో పుష్ప!
X
ఓటీటీ సంస్థలకు కూడా కొన్ని సినిమాలు వలన బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి కరోనా కారణంగా చాలా వరకు ఓటీటీ సంస్థలు బాగా నిలదొక్కుకున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత మళ్లీ ఓటీటీలో వచ్చిన కూడా జనాలు ఎగబడి చూస్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన కొన్ని డిఫరెంట్ సినిమాలు భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకున్నాయి.

ఇక 2002లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాల లిస్టు ఈ విధంగా ఉంది. ముందుగా నెంబర్ వన్ స్థానంలో అయితే పుష్ప 1 సినిమా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మొదటి రోజే భారీ స్థాయిలో వ్యూవ్స్ సొంతం చేసుకుంది.

ఇక రెండవ స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 నిలవగా మూడవ స్థానంలో కేజిఎఫ్ చాప్టర్ 1 నిలిచింది. సెకండ్ పార్ట్ కారణంగా జనాలు ఆ సినిమా విడుదల కాకముందే మొదటి చాప్టర్ కూడా ఎగబడి చూశారు. ఇక అమెజాన్లో ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన సినిమాలలో సీతారామం నిలవడం విశేషం. ఇక తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 కూడా అమెజాన్ ప్రైమ్ కి బాగానే కలిసి వచ్చింది.

మణిరత్నం PS 1 సినిమాను ఔత్ నార్త్ అన్ని భాషల వారు వీక్షించడంతో ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఐదు స్థానాల తర్వాత హిందీ సినిమాలు నిలవడం విశేషం. 6వ స్థానంలో బచ్చన్ పాండే, ఏడవ స్థానంలో జూగ్ జూగ్ జియో అనే సినిమా నిలిచింది. ఇక చివరగా రన్వే 34 అనే సినిమా, ఎనిమిదవ స్థానంలో జురాసిక్ వరల్డ్ డొమినియం 9వ స్థానంలో ఉండగా దీపిక పదుకొనే గెహారియా మూవీ పదవ స్థానంలో నిలిచాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.