Begin typing your search above and press return to search.

2022 లో బాలీవుడ్ ని బోల్తా కొట్టించిన చిత్రాలివి!

By:  Tupaki Desk   |   24 Dec 2022 5:56 AM GMT
2022 లో బాలీవుడ్ ని బోల్తా కొట్టించిన చిత్రాలివి!
X
కోవిడ్ కాలం బాలీవుడ్ కి క‌లిసి రాలేదు అన్న‌ది ఎంత వాస్త‌వ‌మో! 2022 కూడా అదే ప‌రిశ్ర‌మ కి క‌లిసిరాలేదు అన్న‌ది అంత‌కు మించిన పెద్ద వాస్త‌వం. దాదాపు భారీ బ‌డ్జెట్ సినిమాల‌న్ని బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తాకొట్టాయి. ఆ వ‌సూళ్లు చూసి స్టార్ హీరోలో విస్తుపోయారు. డే వ‌న్ 10 కోట్లు..20 కోట్లు రావ‌డం ఏంట‌ని? షాక్ తిన్న వైనం క‌నిపించింది. వాళ్ల సినిమాల క‌న్నా చిన్న‌సినిమాలే ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి నిర్మాత‌ల‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ దెబ్బ‌కి స్టార్ హీరోల‌కు నోట మాట కూడా రాలేదు. తాజాగా 2022 లో రిలీజ్ అయిన భారీ బ‌డ్జెట్ సినిమాల పైఓ లుక్ ఏస్తే...

ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన 'జయేష్‌భాయ్ జోర్దార్' విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. బ‌డ్జెట్ స‌హా కంటెంట్ భారీగానే హైలైట్ అయింది. ర‌ణ్ వీర్ సైతం ఈ చిత్రాన్ని ఓప్ర‌యోగంలా భావించి చేసారు. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లితాలు మాత్రం ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌లేదు. ఇక బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధాకడ్' తో ప్రేక్ష‌కుల ముందుకొ చ్చింది. లేడీ సూప‌ర్ స్టార్ ప్ర‌చార చిత్రాల‌తో 'ధాక‌డ్' పై ఓ రేంజ్ లో అంచ‌నాలు క్రియేట్ చేసింది. బాలీవుడ్ లెక్క‌ల మార్చేస్తుంద‌ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ బాక్సాఫీస్ తుస్ మ‌నిపించింది. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్ తోనే నిర్మించారు.

అలాగే కోలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'విక్రమ్-వేద'ని అదే టైటిల్తో హిందీలోనూ రీమేక్ అయింది. హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ చిత్రం భారీ అంచ‌నా మ‌ధ్య వ‌చ్చిన వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అలాగే కత్రినా కైఫ్.. ఇషాన్ ఖట్టర్ .. సిద్ధాంత్ చతుర్వేది నటించిన హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్ ని ప్రేక్షకులు తిరస్కరించారు. నిర్మాణ ప‌రంగా భారీగానే ఖ‌ర్చు చేసారు. స్టార్ క్యాస్టింగ్ కోస‌మే కోట్లు వెచ్చించారు. కానీ అంత ఇంపాక్ట్ బాక్సాఫీస్ వ‌ద్ద చూపించ‌లేక‌పోయింది.

ఖిలాడీ అక్షయ్ కుమార్ .. మానుషి చి ల్లర్ నటించిన చారీత్రాత్మ‌క చిత్రం 'సామ్రాట్ పృథ్వీరాజ్' విడుదలకు ముందు ఓ పెద్ద సంచ‌ల‌న‌మైంది. కానీ విడుదలయ్యాక ప్రేక్షకులను మాత్రం థియేటర్లకు ర‌ప్పించ‌డంలో విఫ‌ల‌మైంది. కోట్ల రూపాయ‌లు ఈ సినిమా నిర్మాణానికి ఖ‌ర్చు అయింది. అలాగే అక్ష‌య్ న‌టించిన 'ర‌క్షాబంధ‌న్' కూడా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.

ఇంకా మిస్టర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా కూడా ఘోర‌మైన ఫ‌లితాలు సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద కొత్త‌రికార్డులు న‌మోదుచేస్తుంద‌ని అమీర్ భావించారు. కానీ అందుకు రివ‌ర్స్ స‌న్నివేశం అక్క‌డ క‌నిపించింది. ఇంకా బ్ర‌హ్మ‌స్ర్త మొద‌టి భాగం భారీ ఓపెనింగ్స్ కి ప‌రిమిత‌మైంది త‌ప్ప లాంగ్ ర‌న్ లో ఫెయిల్యూర్ చిత్రంగానే మిగిలిపోయింది. ఇంకా ప‌లు సినిమాలు ఈజాబితాలో ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.