Begin typing your search above and press return to search.

2022: లాస్ట్ ఫ్రైడే నిరాశ ప‌రిచిందిగా!

By:  Tupaki Desk   |   31 Dec 2022 12:30 PM GMT
2022: లాస్ట్ ఫ్రైడే నిరాశ ప‌రిచిందిగా!
X
మ‌రి కొన్ని గంట‌ల్లో 2022 కు ఎండ్ కార్డ్ ప‌డ‌బోతోంది. ఆదివారం 2023కి అంతా స్వాగ‌తం ప‌ల‌క‌బోతున్నారు. ఇప్ప‌టికే న్యూ ఇయ‌ర్ హంగామా వ‌ర‌ల్డ్ వైడ్ గా మొద‌లైంది. ప్ర‌తీ ఒక్క‌రూ పాత ఏడాదికి వీడ్కోలు ప‌లికేసి స‌రికొత్త ఆశ‌ల‌తో.. కొత్త కొత్త ఆలోచ‌న‌లు, ల‌క్ష్యాల‌తో న్యూ ఇయ‌ర్ కు స్వాగ‌తం ప‌ల‌క‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది చివ‌రి ఫ్రైడే అయిన డిసెంబ‌ర్ 30న విడుద‌లైన సినిమాలు పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయాయి.

ఎప్ప‌టి లాగే ప్ర‌తీ ఫ్రైడే రోజున సినిమాల సంద‌డి మొద‌లైంది. పెద్ద సినిమాలు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో 'అవ‌తార్ 2', 'ధ‌మాకా'లు థియేట‌ర్ల‌లో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌గానే కొత్త హీరోలు, చిన్న హీరోలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆది సాయికుమార్ ఈ ఫ్రైడే 'టాప్ గేర్‌' అంటూ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. నేప‌థ్య సంగీతం , కాన్సెప్ట్, ఫ‌స్ట్ హాఫ్ బాగానే వున్నా సెకండ్ హాఫ్ కి వచ్చేసే స‌రికి ద‌ర్శ‌కుడు చేతులెత్తేశాడు. దీంతో యావ‌రేజ్ టాక్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఇక బిగ్ బాస్ సీజ‌న్ తో పాపుల‌ర్ అయిన సోహైల్ 'ల‌క్కీ లక్ష్మ‌ణ్'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. కొత్త ద‌ర్శ‌కుడితో చేసిన ఈ మూవీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ కావ‌డంతో ఏ విష‌యంలోనూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక పోయింది.

బిగ్ బాస్ తో ద‌క్కించుకున్న ఫేమ్ ని క్యారీ చేయ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టింది. దీంతో బిగ్ బాస్ సోహైల్ హీరోగా తొలి అడుగే ఫ్లాప్ వైపు ప‌డింది. ఈ మూవీస్ తో పాటు తార‌క‌ర‌త్న‌, ప్రిన్స్ న‌టించిన S5, నువ్వే నా ప్రాణం, ఉత్త‌మ విల‌న్ వంటి సినిమాలు విడుద‌ల‌య్యాయి.

ఇందులో ఏ మూవీ కూడా ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయాయి. 2022 లాస్ట్ ఫ్రైడే కావ‌డంతో ఈ రోజు రిలీజ్ సినిమాల్లో ఏ సినిమా అయినా మ్యాజిక్ చేస్తుందేమోన‌ని అంతా ఎదురు చూశారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఫైన‌ల్ గా ఇయ‌ర్ ఎండింగ్ లోని లాస్ట్ ఫ్రైడే రోజు విడుద‌లైన ఏ మూవీ కూడా ప్ర‌భావాన్ని చ‌పించ‌లేక తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. అయితే ఇంత‌కు ముందే విడుద‌లైన అవ‌తార్‌, ధ‌మాకా మాత్రం త‌మ హ‌వాని కొన‌సాగిస్తూ వుండ‌టం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.