Begin typing your search above and press return to search.
జనవరి బరిలో భారీ సినిమాలు .. నెల రోజుల పండుగగా సంక్రాంతి!
By: Tupaki Desk | 30 Sep 2021 5:31 AM GMT'సంక్రాంతి' అంటే ఆ సరదా వేరు .. సందడి వేరు .. ఆ సంబరం వేరు. దసరా .. దీపావళి కంటే, సంక్రాంతికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతా కలిసి సినిమాలకి వెళ్లడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన సంక్రాంతి పండుగ అనేది సినిమాలతో ముడిపడి కనిపిస్తుంది. సంక్రాంతికి కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు .. మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు కనిపిస్తే, సినిమా సందడి అనేది అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తుంది. అందువల్లనే తమ సినిమాలు సంక్రాంతి బరిలో దిగాలని హీరోలు కోరుకుంటూ ఉంటారు. ఆ దిశగా ముందునుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ఎప్పుడూ సంక్రాంతికి రెండు మూడు సినిమాలు బరిలో ఉంటేనే ఏ సినిమా ఎలా ఆడుతుంది? దేని వసూళ్లు ఎంత? ఏ హీరో విజేతగా నిలిచాడు? అనేవి హాట్ టాపిక్ గా మారేవి. అలాంటిది ఈ సారి సంక్రాంతికి వరుస సినిమాలు దూసుకువస్తున్నాయి. థియేటర్లను పెద్ద ఎత్తున అలుముకోవడానికి సిద్ధమవుతున్నాయి. నిజానికి సంక్రాంతి ఐదు రోజుల పండగ .. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు మాత్రమే చేస్తారు. మరి ఈ మూడు రోజుల కోసం ఎన్ని సినిమాలు వస్తాయి? అనే డౌట్ రావడం కామన్. అందువల్లనే వరుసగా వస్తున్న ఈ సినిమాలు సంక్రాంతిని నెల రోజుల పండుగలా మార్చబోతున్నాయి. జనవరిలో థియేటర్ల దగ్గర జాతరలు జరగనున్నాయి.
ఆల్రెడీ సంక్రాంతి పండుగ మూడు రోజులపై కూడా మూడు సినిమాలు కర్చీఫ్ లు వేశాయి. పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్లో రూపొందుతున్న 'భీమ్లా నాయక్'ను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ తరువాత జనవరి 13వ తేదీన 'సర్కారువారి పాట' థియేటర్లకు రానుంది. మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. మహేశ్ బాబు వరుస హిట్లతో ఉండటంతో సహజంగానే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
ఇక ప్రభాస్ సినిమా 'రాధే శ్యామ్' జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడం .. రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ ముగ్గురు హీరోలు ఒక రోజు తేడాతో థియేటర్ల దగ్గర తలపడుతుండటం అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఇక ఆ తరువాత వచ్చే సినిమాలు కూడా సాధారణమైనవేం కాదు. హీరోల క్రేజ్ పరంగా చూసినా .. బడ్జెట్ పరంగా చూసినా ఎంతమాత్రం తగ్గనివే.
ఈ జాబితాలో ముందుగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించి చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా సినిమా ఇది. దసరాకి విడుదల కావలసిన ఈ సినిమా, ఆ రేస్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా జనవరిలో వచ్చే అవకాశం లేకపోలేదనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఇక ఆ తరువాత రానున్న భారీ చిత్రాల కేటగిరిలో చిరంజీవి 'ఆచార్య' .. బాలకృష్ణ 'అఖండ' సినిమాలు కనిపిస్తున్నాయి. కొరటాల కథాకథనాలు .. చిరు లుక్ .. చరణ్ రోల్ .. మణిశర్మ సంగీతం .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తున్నాయి.
ఇక బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడంతో, సహజంగానే 'అఖండ'పై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. బాలకృష్ణ అఘోర లుక్ మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీక్వెల్ గా వస్తున్న 'ఎఫ్ 3'తో వెంకటేశ్, 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్ గా రూపొందుతున్న 'బంగార్రాజు'తో నాగార్జున కూడా జనవరిలోనే వస్తున్నారు. ఇలా సీనియర్ స్టార్ హీరోలు నలుగురూ కూడా ఒకే నెలలో సందడి చేయనుండటం ఈ సంక్రాంతి మాసంలో జరుగుతున్న మరో విశేషంగా చెప్పుకోవాలి. ఈ సంక్రాంతి మూడు రోజుల పండుగ కాదు .. 30 రోజుల పండుగనే విషయాన్ని ఒప్పుకోవాలి.