Begin typing your search above and press return to search.

2022 : బాక్సాఫీస్ ని షేక్ చేసిన టాప్-15 మూవీస్ ఇవే!

By:  Tupaki Desk   |   31 Dec 2022 11:30 AM GMT
2022 : బాక్సాఫీస్ ని షేక్ చేసిన టాప్-15  మూవీస్ ఇవే!
X
2022 ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌దే అగ్ర‌స్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ తెలుగు...క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లు ముందు వ‌రుస‌లో క‌నిపిస్తున్నాయి. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' తో బాక్సాఫీస్ ని షేక్ చేయ‌గా...ఆ సినిమా వ‌సూళ్ల‌ను కొల్ల‌గొడుతూ క‌న్న‌డ సినిమా 'కేజీఎఫ్‌-2' సంచ‌ల‌నం సృష్టించింది. బాలీవుడ్ నుంచి పోటీగా కొన్ని సినిమాలు రిలీజ్ అయిన‌ప్ప‌టికీ అవి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తాచాట లేక‌పోయాయి. దీంతో త‌దుప‌రి స్థానంలో కోలీవుడ్ ప‌రిశ్ర‌మ నిల‌బ‌డింది.

మొత్తంగా 2022 ఇండియాని షేక్ చేసిన చిత్రాల‌న్ని ద‌క్షిణాదివి కావ‌డం విశేషంగా చెప్పొచ్చు. ఆ జాబితా ఇండియా వైడ్ చూస్తే టాప్ 15 చిత్రాల లిస్ట్ ఇలా ఉంది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్' 901 కోట్ల వ‌సూళ్ల‌తో ముందు వ‌రుస‌లో ఉంగా..ఆ వ‌సూళ్ల‌ని ప్ర‌శాంత్ నీల్ 'కేజీఎఫ్ -2' బీట్ చేసింది. సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ 980 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. దీంతో 'ఆర్ ఆర్ ఆర్' బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో ఏడాది రెండ‌వ స్థానంలో నిలిచింది.

ఇక మూడ‌వ స్థానంలో జేమ్స్ కామోరూన్ విజువ‌ల్ వండ‌ర్ 'అవ‌తార్-2' ఉంది. 15 రోజుల్లోనే ఇండియా వైడ్ 374 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. ఫుల్ న‌ర్ లో 'అవ‌తార్ -2'.. 475 కోట్లు సాధిస్తుంద‌న్న‌ది ట్రేడ్ అంచ‌నా. ఇక నాల్గ‌వ స్థానంలో క‌న్న‌డ చిత్రం 'కాంతార' క‌నిపిస్తుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగ రిలీజ్ అయిన 'కాంతార' ఏకంగా 361 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది.

అలాగే మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'పొన్నియ‌న్ సెల్వ‌న్' మొద‌టి భాగం 327 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. బాలీవుడ్ చిత్రం 'బ్ర‌హ్మ‌స్ర్త' పార్ట్-1 ..310 కోట్ల వ‌సూళ్ల‌తో ఆర‌వ స్థానాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ద‌క్క‌డంతోనే ఇది సాధ్య‌మైంది. అయినా నిర్మాణ ప‌రంగా న‌ష్టాలే మిగిల్చింది.

కోలీవుడ్ చిత్రం క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టించిన 'విక్ర‌మ్'307 కోట్ల వ‌సూళ్ల‌తో ప‌రిశ్ర‌మ‌లో రెండ‌వ భారీ చిత్రంగానిలిచింది. లైన‌ప్ లో ఏడ‌వ స్థానంలో ఉంది. బాలీవుడ్ చిత్రాలు 'క‌శ్మీర్ ఫైల్స్' 281 కోట్ల‌తో ఎనిమిద‌వ స్థానంలో... 277 కోట్ల వసూళ్ల‌తో 'దృశ్యం-2' తొమ్మిద‌వ స్థానంలో..(43 రోజుల్లో 290 కోట్లు తేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా) ఉంది.

అలాగే' భూల్ భుల‌య్యా-2...218 కోట్ల తో 10వ స్థానంలో... 170 కోట్ల‌తో 'బీస్ట్' 11వ స్థానంలో.. 'డాక్ట‌ర్స్ స్ర్టేంజ్' 164 కోట్ల వ‌సూళ్ల‌తో 12వ స్థానంలో... 'గుంగూబాయి క‌తియావాడి' 152 కోట్ల‌తో 13 వ‌స్థానంలో నిలిచాయి. తెలుగు సినిమాలు 'స‌ర్కారు వారి పాట' 140 కోట్ల‌తో 14వ స్థానంలో...'భీమ్లా నాయ‌క్' 133 కోట్ల వ‌సూళ్ల‌తో 15వ స్థానంలో నిలిచాయి. మొత్తంగా 2022 లో తెలుగు సినిమాలు అధికంగా భారీ వ‌సూళ్లు సాధించిన‌ట్లు ట్రేడ్ లెక్క‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.