Begin typing your search above and press return to search.
2023 సంక్రాంతి ఫైట్.. దిల్ రాజు బిగ్ రిస్క్!
By: Tupaki Desk | 30 Dec 2022 9:30 AM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల కాలంలో ఆలోచిస్తున్న విధానం చాలా హార్డ్ గా ఉంటుంది. మొత్తానికి ఆయన ఇండస్ట్రీ కి సంబంధించిన వివాదాల్లోకి మరోసారి వెళ్లకూడదు అని చాలా క్లారిటీగా చెప్పేశాడు. ఎవరు ఎలా పోతే నాకేంటి అని విధంగానే ఆయన ఇంటర్వ్యూలలో కూడా సమాధానాలు ఇస్తున్నారు.
ఇక ఈ సంక్రాంతిలో ఇద్దరు అతిపెద్ద టాలీవుడ్ హీరోల సినిమాలు వస్తూ ఉండడంతో దిల్ రాజు మాత్రం ఇతరు తమిళ హీరోలతో చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే మరొకవైపు నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు జనవరి 12, 13 వ తేదీలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇక దాదాపు ఆ సమయంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాతో పాటు అజిత్ నటించిన తెగింపు సినిమా కూడా విడుదల కాబోతున్నాయి.
తమిళ హీరోల సినిమాలకు ఎక్కువ స్థాయిలో ధియేటర్లు ఇవ్వకూడదు అని ఒకవైపు నిర్మాతల మండలి డిమాండ్ వస్తున్నప్పటికీ కూడా దిల్ రాజు అనుకున్న బిజినెస్ కోసం విజయ్ అజిత్ సినిమాలను పోటీపడి మరి విడుదల చేస్తున్నారు.
ముఖ్యంగా తెగింపు సినిమాకు సంబంధించిన నైజం హక్కులతో పాటు మరికొన్ని ఆంధ్ర హక్కులను సొంతం చేసుకుని ఆయనే డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారసుడు సినిమాకు కనీసం కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ అజిత్ మాత్రం తెలుగులో ఇంతవరకు సరైన కలెక్షన్స్ అయితే అందుకు లేకపోయాడు.
అలాంటిది అతను నటించిన తెగింపు సినిమాను దిల్ రాజు ఏ ధైర్యంతో విడుదల చేస్తున్నారు అనేది ఆయనకే తెలియాలి. ఒక విధంగా దిల్ రాజు అంత తేలిగ్గా ఏ నిర్ణయం తీసుకోడు. లాభాలు లేనిదే ఆయన ఒక అడుగు ముందుకు కూడా వేయరు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక అజిత్ తెగింపు సినిమాను విడుదల చేస్తున్నారు అంటే బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది అని టాక్ కూడా వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.