Begin typing your search above and press return to search.
సమ్మర్ జాతరకు అప్పడే వార్ డిక్లేర్ అయిందా?
By: Tupaki Desk | 18 Nov 2022 12:30 PM GMTబాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సమరం జరగబోతోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు క్రేజీ సినిమాలు సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ పొటీకి రెడీ అవుతున్నాయి. రిలీజ్ డేట్స్ ప్రకటించకపోయినా సంక్రాంతి ఫైట్ కి మాత్రం రెడీ అంటూ ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేశాయి. ఇదిలా వుంటే సంక్రాంతి సమరానికి అంతా సిద్ధమవుతున్న వేళ సైలెంట్ గా అప్పుడే సమ్మర్ వార్ డిక్లేర్ అయిపోయింది. ఈ వార్ లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు ఎప్పటిలాగే తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీకి కాలుదువ్వుతున్నాయి.
అయితే ఈ సమ్మర్ పోటీలో ఇద్దరు వెటరన్ స్టార్ ల మధ్య ఒకే రోజు సరవత్తర పోటీ జరగబోతోంది. వివరాల్లోకి వెళితే... ఇప్పటికే సంక్రాంతి బరిలో మూడు డబ్బింగ్ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలతో పోటీకి సై అంటుంటే సమ్మర్ పోటీనూ డబ్బింగ్ రగడ తప్పడం లేదు. మార్చి నుంచే సమ్మర్ సినిమాల పోటీ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కి ఇంకా మూడు నెలల సమయం వున్నా సరే క్రేజీ స్టార్ లు, వెటరన్ స్టార్ హీరోలు తమ తమ సినిమాల రిలీజ్ డేట్ లని ప్రకటించేసినట్టుగా తెలుస్తోంది.
2023 సమ్మర్ వార్ కి నేచురల్ స్టార్ నాని నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకు పోటీపడబోతున్నారు. మథ్యలో మూడు డబ్బింగ్ సినిమాలు కూడా బరిలో దిగబోతున్నాయి. నేచురల్ స్టార్ నాని తొలి సారి ఊర మాస్ పాత్రలో నటిస్తున్న మూవీ 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మార్చి 28న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మూవీ తరువాత ఏప్పిల్ 7న మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ రూపొందిస్తున్న 'రావణాసుర' రిలీజ్ కాబోతోంది. మొత్తం ఐదుగురు హీరోయిన్ లు నటిస్తున్న ఈ మూవీపై దర్శకుడు సుధీర్ వర్మ, హీరోయిన్ లలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, మేఘా ఆకాష్ భారీ అంచనాలు పెట్టుకున్నారట. ఇక ఏప్రిల్ 14న ఇద్దరు వెటరన్ స్టార్స్ పోటీకి దిగుతున్నారు. చిరు హీరోగా మెహర్ రమేష్ రూపొందిస్తున్న 'భోళా శంకర్', సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న 'జైలర్' సినిమాలు ఒకే రోజున ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్నాయి.
ఈ రెండు సినిమాల్లో చిరుతో మెహర్ రమేష్ రూపొందిస్తున్న 'భోళా శంకర్'పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ 'జైలర్'పై మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం భారీగానే వున్నాయి. 'భోళా శంకర్' లో చిరుతో పాటు కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తుండగా రజనీ 'జైలర్'లో మాత్రం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం మరో ప్రత్యేకత. దీంతో 'జైలర్'పైనే అంచనాలున్నాయి.
ఈ రెండు సీనియర్ ల మధ్య రాఘవ లారెన్స్ 'రుద్రుడు'తో రాబోతున్నాడు. ఇదే ఊపులో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 2' ఏప్రిల్ 28న వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. వీటితో పాటు పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' మే లో రాబోతోంది. మే సెకండ్ వీక్ లో ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ మూవీ కోసం ఏ.ఎం. రత్నం, దర్శకుడు క్రిష్ చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఇలా సమ్మర్ సమరం డిక్లేర్ అయిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.