Begin typing your search above and press return to search.

2023 టాప్ 5 బాక్సాఫీస్ కలెక్షన్స్.. అదిరిందమ్మా!

By:  Tupaki Desk   |   1 April 2023 4:27 PM GMT
2023 టాప్ 5 బాక్సాఫీస్ కలెక్షన్స్.. అదిరిందమ్మా!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సినిమాల విషయంలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పాలి. గతంలో ఎక్కువగా కమర్షియల్ జోనర్ ఫార్మాట్ కి స్టిక్ అయిపోవడం వలన భారీ చిత్రాలు కూడా డిజాస్టర్ అవుతూ ఉండేవి సక్సెస్ అయ్యేవి చాలా తక్కువ ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం సక్సెస్ సినిమాల సంఖ్య పెరిగింది అని చెప్పాలి. ప్రతి నెలలో ఒక, రెండు సక్సెస్ చిత్రాలు వస్తూ ఉన్నాయి.

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే చాలా మంచి రిలీజ్ అయ్యాయి. వాటిలో కమర్శియల్ గా సక్సెస్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. ఇక మొదటి క్వార్టర్ లో టాప్ 5 గ్రాస్ చిత్రాల జాబితా ఒకసారి చూసుకుంటే మొదటి స్థానంలో వాల్తేర్ వీరయ్య సినిమా ఉంది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 220 గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఈ ఏడాదికి ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ గ్రాస్ మూవీ అని చెప్పాలి. దీని తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి మూవీ ఉంది. 133.82 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చి మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. దీని తర్వాత ధనుష్ తెలుగులో చేసిన మొదటి చిత్రం సార్ మూవీ థర్డ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలించింది.

ఈ మూవీ టోటల్ గా 115 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వెంకి అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మరో హిట్ మూవీగా నిలబడింది. దీని తర్వాత వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా బలగం మూవీ నిలబడింది. ఈ సినిఅమ ఇప్పటి వరకు 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

ఇక తాజాగా రిలీజ్ అయిన నాని దసరా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు 54 కోట్ల వరకు షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది.

ఇక వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూడు నెలలలో టాప్ 5 హిట్ చిత్రాలుగా ఈ ఇవి నిలవడం విశేషం అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.