Begin typing your search above and press return to search.

2023NYE మలైకా-అర్బాజ్ కలిసి ఒకే పార్టీలో?

By:  Tupaki Desk   |   4 Jan 2023 5:30 AM GMT
2023NYE మలైకా-అర్బాజ్ కలిసి ఒకే పార్టీలో?
X
అర్బాజ్ ఖాన్- మలైకా అరోరా బ్రేక‌ప్ అనంత‌ర ప‌రిణామాల గురించి తెలిసిందే. ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. త‌మ‌కు న‌చ్చిన భాగ‌స్వామితో స‌హ‌జీవ‌నం సాగిస్తున్నారు. అయితే ఈ జంట‌ కుమారుడైన అర్హాన్ కి సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. వార‌సునితో తరచుగా కనిపిస్తారు. కానీ మంగళవారం రాత్రి ఈ జంట అర్హాన్ లేకుండా పార్టీ నైట్ ఆస్వాధ‌న‌కు వెళ్లారు. అదే క్ర‌మంలో బాలీవుడ్ మీడియా ఈ జంట‌ను వెంటాడింది. కెమెరా ఫ్లాష్ ల‌తో మెరుపులు మెరిపించింది. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో దుమారంగా మారాయి.

బాంద్రాలోని ఒక భవనం వద్దకు వచ్చిన మాజీ జంటను తొలిగా ముంబై ఫోటోగ్రాఫ‌ర్లు గుర్తించారు. మలైకా ష‌ర్ట్ కోట్ ధ‌రించింది. మోకాలి పైకి ఉన్న బూట్లలో ఎప్ప‌టిలానే ఫ్యాష‌నిస్టాగా మెరిపించ‌గా.. అర్బాజ్ బ్లాక్ డెనిమ్స్- బ్లాక్ షర్ట్ - మ్యాచింగ్ స్నీకర్లతో క్యాజువల్ గా క‌నిపించాడు.

అంతకుముందు సాయంత్రం అర్హాన్ ఖాన్ త‌న‌ స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్ వెలుపల కనిపించాడు. ఇటీవల అమెరికా నుండి ఇంటికి తిరిగి వచ్చిన మ‌లైకా- ఆర్భాజ్ జంట వార‌సుడు కెమెరాల‌కు స్టైలిష్ గా పోజులిచ్చాడు.

ఇటీవల తన రియాలిటీ వెబ్ సిరీస్ లో మలైకా.. అర్బాజ్ తో తన రొమాంటిక్ లైఫ్ గురించి ఓపెనైంది. అర్బాజ్ కి ప్రపోజ్ చేసింది నేనే అన్న‌ది ఎవరికీ తెలియదని కూడా తెలిపింది. ''నాకు ప్రపోజ్ చేసింది అర్బాజ్ కాదు. మా స్టోరీ మరో విధంగా ఉంది. నేను అత‌డితో ఓపెన‌య్యాను.నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా? అని అడిగాను. చాలా స్వీట్ గా అతడు (అర్బాజ్) నిజంగానే నావైపు తిరిగి ఓకే చెప్పాడు. ''మీరు ఒక డేని స్థలాన్ని ఎంపిక చేసుకోండి'' అని అన్నారు.

మ‌లైకా ఇంకా మాట్లాడుతూ అప్ప‌టికి తాను చాలా యంగ్ అని తెలిపారు. నేను కూడా మారాను. నేను జీవితంలో భిన్నమైన విషయాలను కోరుకున్నాను. ఈ రోజుకి మేం మంచి వ్యక్తులమని నేను భావిస్తున్నాను... అని వ్యాఖ్యానించారు.

మలైకా అరోరా- అర్బాజ్ ఖాన్ 1998లో వివాహం చేసుకున్నారు. 2016లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మలైకా నటుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. అయితే అదే స‌మ‌యంలో అర్బాజ్ ఖాన్ విదేశీ మోడ‌ల్ కం న‌టి జార్జియా ఆండ్రియానితో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడు. ప్ర‌స్తుతం బ్రేక‌ప్ త‌ర్వాత‌ ఎవ‌రి జీవితాల‌ను వారు స్వేచ్ఛ‌గా ఆస్వాధిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.