Begin typing your search above and press return to search.

సూర్య 'ఇజం' అంట... విన్నారా?

By:  Tupaki Desk   |   7 Sep 2017 6:58 AM GMT
సూర్య ఇజం అంట... విన్నారా?
X
సినిమాల్లోకి వచ్చి ఓ ల్యాండ్ మార్క్ ఇయర్ ను పూర్తి చేసుకున్నారంటే.. ఆయా యాక్టర్లు సంథింగ్ స్పెషల్ గా ఫీల్ కావడంలో తప్పులేదు. తమిళ్ హీరో సూర్య సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. సెప్టెంబర్ 6.. 1997లో విడుదలైన నెరెక్కు నేర్ మూవీతో అరంగేట్రం చేశాడు సూర్య. విజయ్ తో కలిసి నటించాడు. ఇప్పుడు తన తొలి సినిమా వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. అభిమానులకు ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు సూర్య.

సెంటిమెంటల్ సెప్టెంబర్.. 20 ఇయర్స్ ఆఫ్ సూర్యాయిజం అంటూ హ్యాష్ ట్యాగులు కూడా పెట్టాడు. సెప్టెంబర్ సెంటిమెంట్ వరకూ ఓకే కానీ.. మరీ సూర్యాఇజం అంటేనే కాసింత కామెడీగా ఉంది. మన దగ్గర పవనిజం అనే కాన్సెప్ట్ బాగా క్లిక్ అయ్యాక.. ఇతర భాషల్లో కూడా ఇలా తమ హీరోల వెనక ఓ ఇజం తగిలించేసి.. అదో మతం కింద ఆరాధించడం పలు చోట్ల కనిపిస్తోంది. అయితే.. ఈ ఇజం అనే మాటను అభిమానులో.. ఆరాధకులో.. మరొకరో వాడితే కాసింత అందంగా ఉంటుంది. అంతే కానీ.. తనకు తనే సూర్యఇజం అనేసుకుంటే మాత్రం కామెడీ అనిపించడంలో తప్పేమీ లేదు.

"ఈ 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అసాధ్యమైన గమ్యాలను అందుకోగలిగాను. ఇందుకు కారణం మీ అభిమానమే. మీ ప్రశంసలే నన్ను మోటివేట్ చేశాయి. మీ విమర్శలు నన్ను మరింతగా రాటు దేలేలా చేశాయి. మీరిచ్చిన సపోర్ట్ సినిమా పరిధిని దాటి అగరం ఫౌండేషన్ వరకూ నన్ను నడిపించింది. ఇంకా ఎంతో దూరం నేను ప్రయాణం చేయాల్సి ఉంది" అంటూ అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు సూర్య.