Begin typing your search above and press return to search.
24 క్రాఫ్ట్స్ కార్మికుల బంద్ తో RC15 పై బిగ్ పంచ్
By: Tupaki Desk | 22 Jun 2022 5:30 AM GMTకార్మిక ఫెడరేషన్ వర్సెస్ నిర్మాతల వార్ ఎపిసోడ్స్ అంతకంతకు ముదురుతున్నట్టే కనిపిస్తోంది. వేతన సవరణ చేయాల్సిందేనంటూ 24శాఖల కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఫెడరేషన్ హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయంపై చర్చించేందుకు ఇటు తెలుగు ఫిలింఛాంబర్ అటు నిర్మాతల గిల్డ్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో ఏదైనా నిర్ణయం వెలువడుతుందని అంతా ఆశగా వేచి చూస్తున్నారు.
కానీ ఇప్పటివరకూ(22 జూన్) నిర్మాతల వైపు నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. దీంతో నేటి నుంచి జరగాల్సిన షూటింగులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. జూనియర్ ఆర్టిస్టులు డ్యాన్సర్లు సహా లైటింగ్ విభాగం ఇతర శాఖలు కూడా ఈ స్ట్రైక్ లో పాల్గొంటుండడంతో ఇక షూటింగులు చేయలేని పరిస్థితి నెలకొంది.
ల్యాబుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం ఆగిపోవడంతో మునుముందు రిలీజ్ లపైనా ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే దీని ప్రభావం తెలుగు సినిమాలతో పాటు హైదరాబాద్ లో ప్లాన్ చేస్కున్న ఇతర భాషల సినిమాలపైనా తీవ్రంగా పడుతోంది.
తాజా సమాచారం మేరకు.. శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆర్.సి 15 పైనా బంద్ ప్రభావం పడిందని తెలిసింది. ప్రస్తుతం అమృత్ సర్ లో షూటింగ్ కోసం రెడీ అవుతున్న చెర్రీ బృందం అర్థాంతరంగా వాయిదా వేసుకుందని తెలిసింది. కార్మిక బంద్ వల్ల ఈ వాయిదా తప్పలేదు.
ఇక హైదరాబాద్ లోనే షూటింగు జరుపుకుంటున్న సల్మాన్ భాయ్ భారీ చిత్రంపైనా ప్రభావం పడడంతో ఇప్పుడు వేలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోతుండగా.. నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని తెలిసింది. ఇతర చిన్న మధ్యస్థ సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయని తెలుస్తోంది.