Begin typing your search above and press return to search.

FNCC లో 24 క్రాఫ్ట్స్ స‌మావేశం దేనికి?

By:  Tupaki Desk   |   20 Feb 2022 11:24 AM GMT
FNCC లో 24 క్రాఫ్ట్స్ స‌మావేశం దేనికి?
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల సుడిగుండంలో చిక్కుకుంది. రెండేళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న స‌న్నివేశంపై రివ్యూలు సాగుతున్నాయి. ఓవైపు ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల అంశం.. మ‌రోవైపు నైజాంలో మితిమీరిన టికెట్ ధ‌ర‌ల అంశం .. ఇంకోవైపు కార్మికుల క‌ష్ట న‌ష్టాల గురించి కూడా చ‌ర్చోప‌చర్చ‌లు సాగుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు తెలుగు సినీప‌రిశ్ర‌మ క‌ష్టాల గురించి.. అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల గురించి.. కార్మికుల సంక్షేమం గురించి చ‌ర్చించేందుకు 24 శాఖ‌ల ప్ర‌ముఖులు స‌మావేశం నిర్వ‌హించారు. ఇందుకు హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ (ఎఫ్ ఎన్ సిసి) వేదిక‌. అయితే ఈ స‌మావేశంలో ఏం చ‌ర్చించారు? అన్న‌దానిపై కొన్ని వివ‌రాలే బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

FNCC లో 24 క్రాఫ్ట్స్ స‌మావేశంలో రాజ‌మౌళి స‌హా ప‌లువురు సినీప్ర‌ముఖులు పాల్గొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 శాఖ‌ల‌ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్- తెలంగాణ ఫిలిం ఛాంబర్- నిర్మాతల మండలి- మా అసోసియేషన్- దర్శకుల సంఘం- చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. పాల్గొన్నారు.

ఇక ఈ స‌మావేశంలో ప‌రిశ్ర‌మ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. రెండేళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న మార్పులు స‌మ‌స్య‌లు వీట‌న్నిటిపై స‌మీక్షా స‌మావేశ‌మిద‌ని ఛాంబ‌ర్ సెక్ర‌ట‌రీ దామోద‌ర ప్ర‌సాద్ తెలిపారు. ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. ``క్యూబ్.. టికెట్‌ రేట్ల గురించి చ‌ర్చించామ‌``ని అన్నారు.

ఏపీ ప్ర‌భుత్వంతో మీటింగ్ పైనా చ‌ర్చించుకుంటున్నామ‌ని తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించామ‌ని ప్ర‌స‌న్న‌కుమార్ వెల్ల‌డిచంఆరు. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం అని ఆయ‌న అన్నారు.

మైత్రీ మూవీస్ రవి- నవీన్- బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ - స్రవంతి రవికిషోర్- తమ్మారెడ్డి భరధ్వాజ- ముత్యాల రాందాస్ -మాదాల రవి- తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇంత‌కుముందు చిరంజీవి అధ్య‌క్ష‌త‌న సినీహీరోలంతా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. చిరు-మ‌హేష్‌- ప్ర‌భాస్ త‌దిత‌రులు ఈ మీటింగ్ లో ఉన్నారు.