Begin typing your search above and press return to search.
'24 కిస్సెస్': మేకింగ్ వీడియోతో హీటెక్కించారు
By: Tupaki Desk | 17 Nov 2018 4:35 AM GMTఈమద్య కాలంలో చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా ముద్దు సీన్స్ నిలుస్తున్నాయి. గత కొన్నాళ్లుగా వచ్చిన చిన్న చిత్రాలను పరిశీలిస్తే ముద్దు సీన్స్ ఉన్న సినిమాలకు మంచి ఆధరణ దక్కుతుంది. యూత్ ఆడియన్స్ ను కట్టి పడేయాలంటే మంచి కథ, కథనంతో పాటు సందర్బానుసారంగా ముద్దు సీన్స్ ఉంటే మరింతగా ప్రేక్షకుల ఆధరణ దక్కించుకోవచ్చు అనేది యువ తరం దర్శకు అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే చిన్న దర్శకులు ముద్దు సీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక హెబ్బా పటేల్, అధిత్ అరుణ్ లు జంటగా నటించిన ‘24 కెస్సెస్’ చిత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సినిమాలో ఒకటి రెండు ముద్దు సీన్స్ ఉంటేనే రచ్చ రచ్చ ఉంటుంది. అలాంటిది ఈ చిత్రంలో 24 ముద్దు సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. కనుక సినిమాపై యూత్ ఆడియన్స్ ఆసక్తి నెలకొంది. టీజర్ మరియు ట్రైలర్ లో ఒకటి రెండు ముద్దు సీన్స్ ను చూపించిన చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ముద్దు సీన్స్ ను ఎలా చిత్రీకరించారో అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియోలో కూడా ముద్దులు హద్దులు దాటాయి. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకుల్లో ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను తెగ కట్టి పడేస్తోంది. సినిమా ఈనెల 23న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి వ్యక్తం అవుతోంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అనిపిస్తోంది. సినిమాలో ముద్దులు మాత్రమే ఉంటే ఓపెనింగ్స్ వస్తాయేమో కాని, లాంగ్ రన్ కలెక్షన్స్ రావాలి అంటే సినిమాలో కంటెంట్ ఉండాలి. మరి ఈ చిత్రంలో ఏ మేరకు కంటెంట్ ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.