Begin typing your search above and press return to search.
24కి 9 నిమిషాల కోత
By: Tupaki Desk | 7 May 2016 8:36 AM GMTసూర్య 24 సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అటు క్రిటిక్స్ - ఇటు ఆడియెన్స్ సినిమాని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. ఇదేం అంత గొప్ప సినిమా కాదు అంటూనే చివరిగా చూడాల్సిన సినిమా అని క్రిటిక్స్ చెబుతుండటంతో ప్రేక్షకులు థియేటర్లకి కదులుతున్నారు. మరి ఈ టాక్ ఎన్ని వసూళ్లు తెచ్చిపెడుతుందో చూడాలి. స్వయంగా సినిమాని నిర్మించిన సూర్య పిచ్చ హ్యాపీగా వున్నాడు.
సినిమాని ఎలాగైనా అందరికీ చేరువ చేయాలన్న తపనతో ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్ని మరింత పెంచేశాడు. సినిమాపై వచ్చిన విమర్శలు ఎలాంటివో గమనించి ఆ తప్పిదాల్ని సరిదిద్దుకొనే ఛాన్స్ ఏమైనా వుందా అని ఆలోచిస్తున్నాడు. అందులో భాగంగానే సినిమాకి 9 నిమిషాల కోత పెట్టించాడు. సినిమా సెకండాఫ్ మరీ లెంగ్తీగా అనిపిస్తోందని, లవ్ ట్రాక్ కాస్త బోర్ కొడుతోందని విమర్శలొచ్చాయి. వాటినే ట్రిమ్ చేయించాడట సూర్య. దీంతో సినిమా మరింత రేసీగా మారుతుందని చిత్రబృందం నమ్ముతోంది. ఈ రోజు మ్యాట్నీ నుంచే కొత్త వెర్షన్ సినిమా ప్రదర్శితం కాబోతోంది.
ఈ వీకెండ్ కీలకం కాబట్టి ఈ రెండు రోజులు సినిమాకి మరింత మౌత్ పబ్లిసిటీ జరిగితే ఇక తిరుగుండదని సూర్య భావిస్తున్నాడట. అందుకోసం తెలుగు - తమిళ భాషల్లో మరోసారి పబ్లిసిటీ కార్యక్రమాల్ని నిర్వహించేందుకు నడుం బిగించినట్టు సమాచారం. 24 సినిమా సూర్యకి భారీగా లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు - తమిళ భాషల్లో వస్తున్న వసూళ్లే కాకుండా రీమేక్ రైట్స్ రూపంలో కూడా భారీ రేటు వచ్చే అవకాశాలున్నాయని సూర్య గట్టిగా నమ్ముతున్నాడు. మరి బాలీవుడ్ జనాలు ఈ సినిమాపై మక్కువ చూపిస్తారో లేదో!