Begin typing your search above and press return to search.
హేయ్ సమంత.. మొత్తం కథ చెప్పేశారే?
By: Tupaki Desk | 5 May 2016 4:33 PM GMTమరి కొద్ది గంటల్లో.. హీరో సూర్య అండ్ డైరక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో రూపొందిన ''24'' సినిమా మన ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఒక రాత్రి మాత్రమే మిగిలి ఉందనగా.. ఇప్పుడు టోటల్ కంటెంట్ ను చెప్పేస్తే ఒక ట్రలైర్ ను రిలీజ్ చేశారు. స్వయంగా మనం సమంతాల సమంతం ఆ విషయం ట్వీట్ చేసింది.
మ్యాటర్ ఏంటంటే.. ఈ ట్రైలర్ చూస్తే టోటల్ 24 కథ తెలిసిపోతుంది. ఈ సినిమాలో సీనియర్ సూర్య చేసేది.. ''ప్రాజెక్ట్ 24''. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక వాచ్ కనిపెడతాడు సూర్య సీనియర్. ఆ వాచ్ సహాయంతో టైమ్ ను ఫ్రీజ్ చేయొచ్చు.. అలాగే రివర్స్ టైములోనూ ట్రావెల్ చేయొచ్చు. ఇతని భార్య నిత్యా మీనన్. ఇతగాడి అన్న ఆత్రేయ (బట్టతల సూర్య). వీళ్ల మధ్య ఏం జరుగుద్దో తెలియదు కాని.. ఫ్యూచర్ లో ఈ సైంటిస్ట్ సూర్య కొడుకు.. ఇంకో సూర్య. ఇతగాడు సమంతతో రొమాన్స్ చేస్తుంటాడు. ఆ గ్యాప్ లో తండ్రి ఇచ్చిన ఆ వాచ్ గురించి ఎవ్వరికీ తెలియని విషయం కనిపెడతాడు. అప్పుడే కరెక్టుగా పెద్దనాన్న.. బట్టతల సూర్య మరోసారి రంగంలోకి దిగుతాడు. రెహమాన్ స్వరాల మాయాజాలం నుండి.. గ్రాఫిక్స్ తాలూకు ప్రభంజనం వరకు.. అంతా ఈ ట్రైలర్ లో చూపించేశారు. దాదాపు కథ అంతా చెప్పేసినట్లే.
ఏమ్మా సమంతా.. ఇలా మొత్తం కథంతా ఎందుకు చెప్పేశారు? విక్రమ్ అందించిన స్ర్కీన్ ప్లే మీద నమ్మకంతోనే ఇలా కథ ముందే చెప్పేశారా? ఆల్ ది బెస్ట్.