Begin typing your search above and press return to search.

`మాస్ట‌ర్` సీన్స్ లీకు బాబుపై 25 కోట్ల దావా

By:  Tupaki Desk   |   20 Jan 2021 9:15 AM IST
`మాస్ట‌ర్` సీన్స్ లీకు బాబుపై 25 కోట్ల దావా
X
రిలీజ్ ముందు సినిమా నుంచి కీల‌క స‌న్నివేశాలు లీకైపోతే నిర్మాత‌కు టెన్ష‌న్ ఎలా ఉంటుందో ఇంత‌కుముందు `అత్తారింటికి దారేది` అనుభ‌వం తెలియ‌జెప్పింది. అప్ప‌ట్లో ఆ మూవీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ గుండె నొప్పితో ఆస్ప‌త్రిలో చేరారు. ఇలాంటి అనుభ‌వాలు ఆ త‌ర్వాతా ప‌లువురికి ఎదుర‌య్యాయి.

ఇప్పుడు సేమ్ టు సేమ్ అనుభ‌వం మాస్ట‌ర్ నిర్మాత‌ల‌కు ఎదురైంది. స‌రిగ్గా సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న ఈ మూవీ వీడియో క్లిప్పింగుల్లో కీల‌క సీన్లు బ‌య‌ట‌ప‌డిపోవడంతో నిర్మాత లు విప‌రీత‌మైన టెన్ష‌న్ కి గుర‌య్యారు. ఇలాంటి లీక్ లు నిర్మాతలకు పీడకలలలాంటివి. కీలకమైన ఫుటేజీని చట్టవిరుద్ధంగా లీక్ చేయడం ద్వారా న‌ష్టం క‌లుగుతుంద‌న్న భ‌యం బెంగ ఎవ‌రికీ ఉండ‌దు. మాస్ట‌ర్ లీక్స్ కి ఇలాంటి వాళ్లే కార‌ణం.

ఈ మూవీ ఓవ‌ర్సీస్ రిలీజ్ ల‌ కోసం డిజిటల్ ప్రింట్లను విదేశాలకు పంపినందుకు మేకర్స్ ఒక ప్రైవేట్ డిజిటల్ కంపెనీకి ఫుటేజ్ అందించారు. ఆ సంస్థకు చెందిన ఒక ఉద్యోగి ఈ చిత్రం థియేటర్లలోకి రాకముందే మాస్టర్ నుండి అనేక దృశ్యాలను లీక్ చేసేశాడు. దీంతో నిర్మాత‌ల‌కు టెన్ష‌న్ త‌ప్ప‌లేదు. ఎట్ట‌కేల‌కు లీకుల‌కు కార‌కుడిపై ఈ చిత్ర నిర్మాతలు కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఫుటేజీని లీక్ చేసిన ఉద్యోగిపైనా పరిహారంగా 25 కోట్లు దావా వేస్తున్నార‌ట‌. ఇప్పటికే స‌ద‌రు డిజిటల్ సంస్థకు .. లీకు బాబుకు లీగల్ నోటీసు పంపార‌ట‌.

సంక్రాంతి బ‌రిలో రిలీజైన మాస్ట‌ర్ కి తెలుగునాట మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా తమిళనాడులోని ద‌ళ‌పతి అభిమానులు ప‌ట్టుబట్టి మ‌రీ హిట్టందించారు. అక్క‌డ‌ సూపర్ హిట్ చిత్రంగా నిల‌వ‌గా తెలుగు లో యావ‌రేజ్ గా నిలిచిందని టాక్ ఉంది. మాస్ట‌ర్ మాత్ర‌మే కాదు.. మునుముందు క్రేజీ స్టార్లకు ఫుటేజ్ లు లీక్ ల టెన్ష‌న్ మాత్రం వ‌దిలిపెట్టేట్టు లేదు. అన్నీ తెలిసీ లీక్ చేస్తున్న వారిని నిలువ‌రించ‌డం అంత సులువేమీ కాద‌ని అర్థ‌మ‌వుతోంది. అలాగే మాస్ట‌ర్ ఫుటేజ్ లీకేజ్ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో అత్తారింటికి దారేది సినిమా బాక్సాఫీస్ కి క‌లిసొచ్చిన‌ట్టే తమిళ‌నాట క‌లిసొచ్చింద‌న్న మ‌రో కోణంపైనా టాక్ ఉంది.